25 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం


Thu,May 23, 2019 01:14 AM

అడ్డాకుల: మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా దగ్గర బుధవారం ఉదయం మినీ డీసీఎంలో అక్ర మంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు అడ్డాకుల ఎస్‌ఐ నరేశ్ తెలిపారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జడ్చర్ల నుంచి గద్వాలకు రేషన్ బియ్యాన్ని మినీ డీసీఎంలో తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ తన సిబ్బందితో టోల్‌ప్లాజా దగ్గర తనిఖీలు నిర్వహించగా అక్రమంగా తరలిస్తున్న డీసీఎంను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు వివరించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు సమాచారం ఇవ్వగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ విష్ణుప్రియ పంచ నామా నిర్వహించినట్లు తెలిపారు. మదనాపురం గ్రామానికి చెందిన డీసీఎం డ్రైవర్ రామకృష్ణపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...