పెళ్లి ఉచ్చులో బాల్యం బందీ


Mon,May 20, 2019 03:57 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ: బాల్యవివాహాలపై అవగాహన లేని తల్లిదండ్రులు చిన్నతనంలోనే తమ చిన్నారులకు వివాహాలు చేసి భారం దింపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సంబంధించిన అధికారులు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చినా గుట్టుచప్పుడు కాకుండా ఊరు దాటించి వివాహాలను చేస్తున్నారు. పెళ్లి అంటే తెలియని వయస్సులోనే తాళి కట్టించి , వారి బతుకులను నాశనం చేస్తున్నారు. ఇటీవల వనపర్తి మండల పరిధిలోని చిమనగుంటపల్లి గ్రామంలో బాల్యవివాహాలు జరగుతున్న సమాచారం తెలుసుకున్న అధికారులు ఆ వివాహాన్ని ఆపి అమ్మాయి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు అమ్మాయిని మహబూబ్‌నగర్‌లోని స్టేట్ హోంకు తర లించారు.

ఆడపిల్లలంటే భారం
సమాజం ఎంతో అభివృద్ది చెందింది. ప్రసార మాధ్యమాల ద్వా రా బాల్యం వివాహాల వల్ల కలిగే అనర్థాలను గురించి విస్తృ తంగా ప్రచారం చేస్తున్నారు. అయినా చాలా మంది తల్లిదండ్రు లు నేటికీ ఆడపిల్లలంటే భారంగానే భావిస్తున్నారు. చదువుకునే వయస్సులో జీవితంపై అవగాహన ఏర్పడకుండానే పెళ్లి చేసి వారి బాల్యాన్ని బందీ చేస్తున్నారు. పదో తరగతి తర్వాత పెళ్లి వద్దు ... పై చదువులు చదివించాలంటూ సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో అమ్మాయి చదువు అవనికి వెలుగు అంటూ ప్రచా రాలు నిర్వహిస్తున్నా కొంతమంది తల్లిదండ్రులు చిన్న వయ స్సులో పెళ్లి చేసి చేతులు దులుపుకుంటున్నారు.

ఐసీడీఎస్ పాత్ర కీలకం..
బాల్యవివాహాలను అరికట్టడంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ పరిధిలోని ఐసీడీఎస్ కీలకపాత్ర పోషిస్తుంది . 11 నుంచి 18 సంవత్సరాల లోపు కిశోర బాలికల జాబితా అంగన్‌వాడీ టీచర్ల వద్ద ఉంటుంది. వీరు గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగు తున్నట్లు గుర్తించి ముందుగానే ఉన్నతాధికారులతోపాటు పోలీసులకు సమాచారమివ్వాలి. ఈ విధంగా ఐసీడీఎస్ అధికారులు 2018 సంవత్సరంలో 15 బాల్యవివాహాలు, 2019లో ( జనవరి నుంచి మే వరకు ) 7 బాల్య వివాహాలను అడ్డుకుని వధూవరుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి అమ్మాయిలను స్టేట్‌హోంకు తరలించారు.

చట్టం ఏం చెబుతుంది?
బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 సంవత్సరాలు దాటిన తర్వాతే పెళ్లి చేయాలి. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే బెయిల్ లభించని నేరంగా పరిగణిస్తారు. రెండేళ్ల జైలుతో పాటు వివాహాన్ని రద్దు చేస్తారు. ఎక్కడైనా బాల్య వివాహాలు చేస్తున్నట్లు తెలిస్తే 1098, 100 టోల్‌ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అం దించాలి. సమాచారం తెలియజేసిన వారి వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతారు. బాల్యవిహాలను అరికట్టే బాధ్యతలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...