ఒకే రౌండ్‌లోనే..ఫలితాలు వెల్లడించాలి


Sun,May 19, 2019 02:01 AM

-ఎన్ని కల విధులు నిర్వ హించే అధి కా రు లకు డ్రెస్ కోడ్ తప్ప ని సరి
-సాధ్య మై నంత వరకు ఒకే హాల్ లోనేఓట్ల లెక్కింపు జర గాలి
-ఉదయం 7 గంట ల లోగా కౌంటింగ్ హాల్ లోకి బ్యాలెట్ బాక్సులు వెళ్లాలి
-అధి కా రుల సమా వే శంలో పాల మూరు కలె క్టర్ రొనా ల్డ్ రోస్
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి వెల్లడించనున్న ఫలితాల ప్రక్రియ ఒకే రౌండ్‌లోనే పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో కౌం టింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎంపీటీసీ అభ్యర్థుల ఫలితాలు ముందుగా వెల్లడించాలని, మధ్యాహ్నం తర్వాత జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు తెలియజేయాలని సూచించా రు. బ్యాలెట్ బాక్సులు అన్ని టేబుల్స్‌పై ఉంచి గందరగోళం చేయకూడదని, ఎక్కడ ఎలాంటి సమస్యలు లే కుండా పారదర్శకంగా సింగల్ టేబుల్ వేసి ఒక బ్యాలె ట్ బాక్స్ తర్వాత మరో బ్యాలెట్ బాక్సును అందుబాటులోకి తీసుకుని కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. జిల్లాలోని 7 మండలాల్లో అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైందని, 2వేల ఓటింగ్ శాతం కంటే అధికంగా నమోదైన గ్రామాలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సరిగ్గా 7 గంటలకు బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ హాల్‌లోకి వెళ్లాలని, 8 గంటలకు కౌంటింగ్ ప్రాంభించాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు తమకు అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధ్యులపై చర్యలు ఉంటాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని తెలిపారు. ముందుగా అధికారులకు కేటాయించిన మండలాల పరిధిలోని హాల్‌ను ప్రత్యేకంగా పరిశీలించాలని, టేబుల్స్ అవసరమైతే కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక బ్యాలెట్ బాక్సు తర్వాత మరో బ్యాలెట్ బాక్సును తీసుకుని కౌంటింగ్ నిర్వహించాలని తెలిపారు. 25 ఓట్లను ఒక కట్ట కట్టి ఉంచుకోవాలని, పూర్తి స్థాయిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్లు, చెల్లని ఓట్లు విభజన చేసిన తర్వాత ఒకే రౌండ్‌లోనే ఫలితాలను వెల్లడించాలన్నారు. కౌంటింగ్‌కు సంబంధించి రెండు గదుల్లో ఓటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తే ఏ గదిలో ఉన్న ఓట్ల ప్రక్రియ ఆ గదిలోనే కౌంటింగ్ చేయాలని, బ్యాలెట్ బాక్సుల నుంచి వేరు చేసిన తర్వాత ఇతర గదులకు ఆ ఓట్లను తీసుకువచ్చి కౌంటింగ్ చేయకూడదన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ముందస్తు చర్యలు తీసుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. ఆరగంట ఆలస్యమైనా పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ జరగాలని స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి మండలానికి నిధులు అందుబాటులో ఉంచడం జరిగిందని, ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు భోజన ఏర్పాట్లు చేయాలన్నా రు. ఎన్నికల నిర్వహణకు ఎంత మొత్తం నిధులు అవసరమున్నాయో తెలియజేయాలని సూచించారు. అధికారుల దగ్గర ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి స మగ్ర సమాచారం అందుబాటులో ఉండాలని తెలిపా రు. సమావేశంలో జెడ్పీ సీఈవో వసంతకుమారి, వివి ధ శాఖల అధికారులు ఉన్నారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...