నకిలీ విత్తనాల పై అప్రమత్తంగా ఉండాలి


Sun,May 19, 2019 01:59 AM

జడ్చర్ల రూరల్ : రైతులు నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ ఏడీ వెంకటేశ్ అన్నారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయశాఖ ఎన్స్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చేపట్టిన దాడులలో భాగంగా జడ్చర్ల పట్టణంలోని వివిధ ట్రాన్స్‌ఫోర్ట్‌లలో విత్తనాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్రంలో 6 బృందాలుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వివిధ ట్రాన్స్‌ఫోర్ట్స్‌పై దాడులు నిర్వహించడం జరుగుతుందన్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చేల్, గద్వాల తదితర జిల్లాల్లో శనివారం దాడులు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయానికి ఇదే సమయంలో విత్తనాలను సరఫరా చేసే సమయం కావడంతో ఇతర రాష్ర్టాల నుంచి నకిలీ విత్తనాలు ట్రాన్స్‌ఫోర్ట్‌ల ద్వార రాష్ట్రంలో సరఫరాకు వస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశంలో హెచ్(హెర్బిసైడల్ టాలరీస్)పత్తి విత్తనాలను నిషేదించడం జరిగిందన్నారు. ఈ రకం విత్తనాల వల్ల రైతుల పంట పొలాలు పూర్తిగా దెబ్బతింటాయని, భవిష్యత్‌లో ఆయా పొలాల్లో ఎలాంటి పంటలు పండక పోవడమే కాకుండా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని తెలిపారు. గ్రామాల్లోకి గుర్తు తెలియని వ్యక్తులు తక్కువ ధరకు విత్తనాలు అమ్ముతామని వస్తే వాటిని తీసుకోరాదని సూచించారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, రైతులు దళారులతో ఎలాంటి నిషేదిత విత్తనాలను తీసుకొని మోసపోరాదని ఆయన వివరించారు. ఈ దాడులలో తెలంగాణ విత్తనాభివృద్ధి కార్పొరేషన్ మేనేజర్ హెచ్‌కే సింగ్, టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...