మరుగుదొడ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి


Sun,May 19, 2019 01:59 AM

నారాయణపేట రూరల్ : గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు తర్వతిగతిన పూర్తి చేసి ఓడీఎఫ్ గ్రామంగా తీర్చిదిద్దాలని నారాయణపేట కలెక్టర్ వెంకట్రావు అన్నారు. నారాయణపేట మండలం బోయిన్‌పల్లి గ్రామాన్ని కలెక్టర్ సందర్శించి మరుగుదొడ్ల నిర్మాణాలతోపాటు, సామగ్రిని పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఏర్పాటు చేసుకోవాలన్నారు. మహిళా సంఘాల సభ్యులు, ఐకేపీ అధికారులు మరుగుదొడ్ల ఆవశ్యకతపై గ్రామస్తులకు అవగాహన కల్పించి వారం రోజుల్లో నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలన్నారు. కాగా, మరుగుదొడ్ల నిర్మాణ పరిశీలన కోసం గ్రామంలో కలెక్టర్ పర్యటిస్తుండగా ఓ బోరు వద్ద నీరు వృథాగా పోతుండడంతో అది గమనించి నీటి ట్యాంకును ఏర్పాటు చేసుకోవాలని, ఆ బోరు చుట్టు పక్కల ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలన్నారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీని గమనించిన కలెక్టర్ పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టాలని ఈఈని ఆదేశించారు. తమ గ్రామానికి బస్సు రావడం లేదని, కేవలం ఒక రోజు మాత్రమే వచ్చి వెళ్లిందని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే కలెక్టర్ స్పందించి ఆర్‌ఎంతో ఫోన్‌లో మాట్లాడారు. గ్రామ సర్పంచ్, ప్రజలతో తీర్మాణం చేయించి ఆ కాపీని డిపోలో అందజేయాలని తెలిపారు. గ్రామంలోని అంగన్‌వాడీ భవనానికి మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజు, ఏపీఎం నిర్మల, ఎంపీడీవో వెంకటయ్య, ఇన్‌చార్జి ఏపీఎం వినయ్‌కుమార్, సీసీ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...