మోసాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు


Sun,May 19, 2019 01:59 AM

మహబూబ్‌నగర్ క్రైం : రైతులకు విక్రయించే విత్తనాలు, ఎరువుల విషయంలో మోసపూరితంగా వ్యవహరించే వ్యాపారులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రెక్కలు ముక్కలు చేసుకొని సమాజానికి ఆహారాన్ని సమకూర్చే రైతులు, శ్రమ జీవులను మోసం చేసేవారు జాతి విద్రోహులతో సమానమని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు, వారిని బ్లాక్ లిస్టులో పెడ్తామని తెలిపారు. జిల్లాలో అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు నేతృత్వంలో పోలీసు ప్రత్యేక బృందాలు నిరంతర నిఘాలో ఉన్నాయని పేర్కొన్నారు. నాసిరకం విత్తనాలు, ఎరువులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. రైతులు కూడా కొత్త వ్యక్తులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులను నమ్మి ఎరువులు, విత్తనాలు కొనవద్దని, వ్యవసాయ శాఖ ధృవీకరించిన వ్యాపారుల వద్దనే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభిస్తాయన్న విషయం గుర్తించాలని తెలిపారు. పోలీసు శాఖ చేస్తున్న వివిధ సామాజిక సమస్యల ప్రక్షాళనకు ప్రజలు సహకరించాలని ఎస్పీ రెమా రాజేశ్వరి విజ్ఞప్తి చేశారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...