జూన్ 3,4,5 తేదీల్లో చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు


Sun,May 19, 2019 01:59 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మయూరీ ఎకో పార్కులో జూన్ 3,4,5 తేదీల్లో విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఎఫ్‌వో గంగారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ విభాగంలో 4 నుంచి 6వ తరగతి విద్యార్థులకు, సీనియర్ విభాగంలో 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పోటీలు ఉంటాయన్నారు. 3,4 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి 11:30 గంటల వరకు, 5న సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు జూనియర్, సీనియర్ విభాగాలకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు 5న మయూరీ పార్కులో నిర్వహించనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...