పాలమూరు జిల్లాతో రాళ్లపల్లికి వీడని బంధం


Sat,May 18, 2019 05:50 AM

మహబూబ్‌నగర్ నమస్తే తెలంగాణ : సినీ, నాటక రంగాలలో తనదైన శైలిలో రాణించి లక్షలాది మంది అభిమానుల హృదయాలను దోచుకొని ఆనారోగ్యంతో శుక్రవారం మృతి చెందిన రాళ్లపల్లికి పాలమూరు జిల్లాతో వీడని అనుబంధం ఉంది. జిల్లాకు చెందిన ప్రముఖ కవి, కమలేకర్ రాంచందర్‌జీతో కలిసి విద్యాభ్యాసం చేసిన రాళ్లపల్లి మొదట్లో రంగస్థల నటుడిగా రాణించి సినీ రంగంలో ప్రవేశించి వందలాది చిత్రాలలో పలు పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ఈయన కమలేకర్ రాంచందర్‌జీతో ఉన్న పరిచయం కారణంగా ప్రముఖ వెంకటేశ్వర శర్మ రచించిన స్పందన కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. 2005వ సంవత్సరంలో జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాళ్లపల్లి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రస్తుత జిల్లా ప్రముఖ కవి చంచల రవి, భారత్ వికాస్ పరిషత్ జాతీయ అధ్యక్షుడు పాండురంగం తదితరులు ఆహ్వానించి అప్పటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉమ్మడి పాలమూరులో జిల్లాలోజరిగిన పలు కార్యక్రమాల్లో రాళ్లపల్లి పాల్గొన్నారు. రాళ్లపల్లి మృతిపట్ల చంచలరవి, పాండురంగం, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, లయన్ నటరాజ్, జేపీఎన్‌సీఇ రవికుమార్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...