మెరుగైన బోధనే ప్రభుత్వ ధ్యేయం


Fri,May 17, 2019 01:44 AM

అయిజ : రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఉమ్మడి జిల్లా లో కేవలం 3 పాఠశాలలే ఉండగా.. సీఎంగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉమ్మడి జిల్లాలో 12 గురుకుల పాఠశాలలను కొత్తగా ఏర్పాటు చేశారు. 2019-20 ఏడాదికి గాను ఉమ్మడి జిల్లాలో మరో 12 బీసీ గురుకుల పాఠశాలలను నెలకొల్పేందుకు మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల విద్యాలయాల సొసైటీ ప్రత్యేక దృష్టి సారించింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2 బీసీ గురుకుల పాఠశాలలను నెలకొల్పేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో మల్దకల్‌ మండ లం, బిజ్జారం, వడ్డేపల్లి మండలం, శాంతినగర్‌లో బీసీ గురుకు ల పాఠశాలలను ప్రారంభించి, 5,6,7 తరగతుల విద్యార్థులకు అడ్మిషన్‌ కల్పించేందుకు ఎంట్రెన్స్‌ నిర్వహించారు. ఒక్కో తరగతి లో రెండు సెక్షన్లు ఏర్పాటు చేసి 80మందికి ప్రవేశం కల్పించను న్నా రు. దీంతో ఉమ్మడి జిల్లాలోని 12 బీసీ గురుకులా ల్లో 2,880 మంది బీసీ విద్యార్థులకు గురుకులాల్లో అవకాశం కల్పించేందుకు బీసీ గురుకుల విద్యాలయాల సొసైటీ ఏర్పాట్లు చేస్తోంది.

రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకుల పాఠశాలలను పెద్ద ఎత్తున ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 142 గురుకుల పాఠశాలలు మహాత్మా జ్యోతి బాపూలే విద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తుండగా, 2019-20 ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా 119 పాఠశాలలను ప్రారంభించేందుకు సర్కారు చర్యలు తీసుకుంటుండగా, ఉమ్మడి జిల్లాలో మరో 12 గురుకుల పాఠశా లలను నెలకొల్పి పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న గురుకులాల్లో 5,6,7 తరగతుల విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. ఒక్కో తరగతిలో 80మంది విద్యార్థులకు అడ్మిషన్‌ కల్పించేందుకు ఇప్పటికే ఎంట్రెన్స్‌ నిర్వహించింది. ఉమ్మడి జిల్లాలో 12 పాఠశాలల్లో 2,880 మంది విద్యార్థులకు ప్రవేశం క ల్పించేందుకు మహాత్మా జ్యోతి బాపూలే బీసీ విద్యాలయాల సొసైటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జోగు ళాంబ గద్వాల జిల్లాలో గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్‌ మండలం, బిజ్జారం గ్రామంలో బాలికలకు, అలంపూర్‌ నియోజక వర్గం శాంతినగర్‌లో బాలురకు ప్రవేశం కల్పించేందుకు బీసీ గురుకుల విద్యాలయాల సొసైటీ సన్నాహాలు చేస్తోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2017 ఏడాదిలో గద్వాల నియోజకవర్గంలోని కేటీదొడ్డిలో బాలురు, అలంపూర్‌ నియోజకవర్గంలోని పుల్లూరులో బాలికల బీసీ గురుకుల పాఠశాలలను నెలకొల్పి విద్యార్థులకు మెరుగైన విద్యను ప్రభుత్వం అందిస్తోంది.

ఇంగ్లిష్‌ మీడియంలోనే బోధన ..
మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లీష్‌ మీడి యంలో బోధన చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో నెలకొల్పనున్న కొత్త గురుకుల పాఠశాలల్లో జూన్‌ 1 నుంచి తరగుతులు ప్రారంభించేం దుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 12 గురుకుల పాఠ శాలల్లో 5,6,7 తరగతులను ప్రారంభించి, ఒక్కో తరగతిలో 80 మం దికి అడ్మిషన్‌ కల్పించనున్నారు. ఒక్కో పాఠ శాలను 240 మంది విద్యార్థులతో జూన్‌ నెలలో ప్రభుత్వం గురుకులాలను ప్రారంభించ నుంది. ఇప్పటికే భవనాల ఎంపికలో కలెక్టర్లు, గురుకులాల అధికా రులు భవనాల గుర్తింపును చేపడుతున్నారు. ఇటీవల జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ శశాంక గద్వాల నియోజకవర్గానికి మంజూరైన బీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసేందుకు గద్వాలకు సమీపం లోని ట్రినిటీ ప్రైవేటు పాఠశాల భవనాన్ని పరిశీలించారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...