జూన్‌ 20న స్పోర్ట్స్‌ స్కూల్‌ ఎంపికలు


Fri,May 17, 2019 01:43 AM

-విద్యార్థులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలి
-డీవైఎస్‌వో సత్యవాణి
మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌: జిల్లా స్థాయి క్రీడా పాఠశాల 4వ తరగతి ప్రవేశాల కోసం జూన్‌ 20న ఎంపికలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్‌వో సత్యవాణి తెలిపారు. గురువారం ఆమె నమస్తే తెలంగాణతో మాట్లాడారు. రాష్ట్రస్థాయి క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హకీంపేటలో జూలైలో మహబూబ్‌నగర్‌ జిల్లాకు సంబంధించిన ఎంపికలు ఉంటాయని, అందులో భాగంగా ముందు జిల్లా స్థాయి ఎంపికలు ఉంటాయని తెలిపారు. ఇక్కడ ఎంపికైనవారు రాష్ట్రస్థాయి ఎంపికలకు వెళ్తారని తెలిపారు. జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ ఎంపికలు జూన్‌ 20న ఎంపికలు ఉంటాయన్నారు. ఉదయం 8:00 గంటలకు మెయిన్‌ స్టేడియంలో సంబంధిత పత్రాలతో రిపోర్టు చేయాలని కోరారు. ఎంపికలకు వచ్చే బాలబాలికలు 10 పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, జననధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్‌ ప్రస్తుత పాఠశాల నుంచి, 3వ తరగతి పోగ్రెస్‌, ఆధార్‌కార్డు, కమ్యూనిటీ పత్రాలు తీసుకురావాలని సూచించారు. 01-09-2010 నుంచి 31-08-2011 మధ్య పుట్టిన వారు అర్హులని పేర్కొన్నారు. ఎటువంటి పత్రాలు లేకున్న ఎంపిలకు అనుమతించమన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్ర స్థాయి ఎంపికలకు నెలరోజుల సమయం ఉంటుందని అనుభవజ్ఞులైన వ్యాయామ ఉపాధ్యాయులచే శిక్షణ తీసుకోవాలని సూచించారు. ఎంపికల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే తన దృష్టికి తీసుకరావాలని సూచించారు. సందేహాలుంటే 9966201689 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...