పరిశుభ్రతతోనే డెంగీ దూరం


Fri,May 17, 2019 01:43 AM

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ: పరిశుభ్రతతో ప్రతి ఒక్కరికీ నిండు జీవితం సుఖసంతోషాలతో లభిస్తుందని డీఆర్‌వో కె. స్వర్ణలత అన్నారు. గురువారం జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన ర్యాలీని డీఆర్‌వో కె. స్వర్ణలత ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్‌వో కె. స్వర్ణలత మాట్లాడుతూ దోమకాటు నుంచి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. డెంగీని తరమికొట్టేందుకు వైద్య అధికారుల సూచనలు తీసుకుంటు ప్రజలు ముందుకు సాగాలని తెలిపారు. డెంగీ వ్యాధి ఎవరికీ ఎక్కడ సోకకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. తమ ఇంటి చుట్ట్టూ ఉన్న ప్రాంతాలను పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నిర్లక్ష్యం అనే మాటకు తావులేకుండా ప్రతి ఒక్కరు ఇల్లుతోపాటు ఇంటి పరసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ర్యాలీని జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన కూడళ్లమీదుగా ర్యాలీని నిర్వహించారు. రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ లయన్‌ నటరాజ్‌, వైద్య అధికారులు తదితరులు ఉన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...