నాణ్యత లో రాజీ పడొద్దు


Fri,May 17, 2019 01:43 AM

అలంపూర్‌, నమస్తే తెలంగాణ: భవన నిర్మాణ పనుల విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని నాణ్యత లోపించకుండా పనులు గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అబ్రహం గుత్తేదార్‌ను ఆదేశించారు. అలంపూర్‌ చౌరస్తాలో నిర్మాణం చేపడుతున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ పనులను గురువారం ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవన నిర్మాణాలు చేపట్టిందని తెలిపారు. నియోజకవర్గంలోని అలంపూర్‌ చౌరస్తాలో రూ.కోటితో చేపట్టిన కార్యాలయ భవన నిర్మాణం చివరి దశకు చేరిందన్నారు. ఇంకాఫ్లోరింగ్‌, ఫినిషింగ్‌ పనులు, పెయింటింగ్‌ పనులు, ప్రహరి నిర్మాణ పనులు చేయాల్సి ఉన్నాయని వివరించారు. త్వరగా పనులు పూర్తి చేసి నిర్ణీత గడువులోగా కార్యాలయం అప్పగించాలని గుత్తేదారుకు ఎమ్మెల్యే సూచించారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...