‘మిషన్‌ భగీరథ’ను పరిశీలించిన కేంద్ర బృందం


Thu,May 16, 2019 01:31 AM

జడ్చర్ల రూరల్‌ : తెలంగాణలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం పని తీరును బుధవారం కేంద్ర బృందం పరిశీలించింది. ముందుగా జడ్చర్ల మండలంలోని నాగసాల గ్రామ సమీపంలోగల పందిరిగుట్ట దగ్గర ఏర్పాటు చేసిన వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను సందర్శించారు. రా వాటర్‌ ప్లాంట్‌ను పరిశీలించి నీటి శుద్ధి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ల్యాబ్‌లో క్లోరీన్‌ నీటిలోని బ్యాక్టీరియను చంపే ప్రక్రియ, మడ్డిధనం మట్టిని శుద్ధి చేసే విధానం, ర్యాపిడ్‌ స్యాండ్‌ ఫిల్టర్లను చూశారు. ఈ సందర్భంగా కేంద్ర తాగునీటి విభాగం డిప్యూటీ అడ్వైజర్‌ రాజశేఖర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం పని తీరును పరిశీలించేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. మూడు రోజుల పర్యటనలో బాగంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ ప్రాంతం, గజ్వేల్‌, సిద్ధిపేట తదితర జిల్లాల్లో పర్యటించి వాటర్‌ ప్లాంట్‌ల పని తీరును పరిశీలించడం జరుగుతుందన్నారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుతున్న తాగునీటి గురించి తెలుసుకుంటున్నామన్నారు. ఈ విధానాన్ని ఇతర రాష్ర్టాల్లో అమలు చేసేందుకు అధ్యాయనం చేస్తున్నామని తెలిపారు. జడ్చర్లలో ఏర్పాటు చేసిన ప్లాంటు పరిశీలనలో భాగంగా ప్లాంట్‌ చుట్టూ సీసీ బెడ్‌, రోడ్లు నిర్మించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో చీఫ్‌ ఇంజినీరు చెన్నారెడ్డి, కంస్టల్‌టెంట్‌ నర్సింగ్‌రావు, ఈఈ వెంకట్‌రెడ్డి, డీఈఈ శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...