కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి


Thu,May 16, 2019 01:31 AM

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : పార్లమెంట్‌ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపునకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ తెలిపారు. మహబూబ్‌నగర్‌ పార్లమెం ట్‌ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లకు ఈనెల 23న నిర్వహించనున్న కౌంటింగ్‌ ప్రక్రియపై బుధవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కౌంటింగ్‌ కోసం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 7 హాల్స్‌ ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో హాల్‌లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈనెల 19వ తేదీలోగా అభ్యర్థులు తమ కౌంటింగ్‌ ఏజెంట్లను నియమించుకొని కౌంటింగ్‌ ప్రా రంభానికి 72 గంటల ముందుగా వారి జాబితాను రి టర్నింగ్‌ అధికారికి అందజేయాలని సూచించారు. ఏ జెంట్లకు జారీ చేసే పాసులతోపాటు, ఏదైన గుర్తింపు కార్డుతో 23న ఉదయం 7.30 గంటలలోపు తమ కౌంటింగ్‌ హాల్‌కు చేరుకునేలా చూడాలన్నారు. వారికి ఎలాంటి నేర చరిత్ర ఉండరాదని, ప్రజాప్రతినిధులై ఉండవద్దని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్లు మహబూబ్‌నగర్‌ శాసనసభ నియోజకవర్గ కౌంటింగ్‌ హాల్‌లో లెక్కిస్తామని తెలిపారు.

ఇందుకోసం ఒక అదనపు ఏజెంట్‌ను నియమించాల్సి ఉంటుందని తెలిపారు. వీ రెవరూ కౌంటింగ్‌ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలిగించరాదని, మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, కారు, బైక్‌ తాళాలు వంటివి కౌంటింగ్‌ హాల్‌లోకి అనుమతించడం జరగదన్నారు. కౌంటింగ్‌ సెంటర్‌ ఆవరణలో స్వయం సహాయక బృందాలచే నిర్వహించబడే నాలుగు పుడ్‌ స్టాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. కౌంటిం గ్‌ ప్రక్రియ నంతా వీడియో తీయడం జరుగుతుందని, ప్రతి కౌంటింగ్‌ హాలులో నాలుగు వైపులా కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 23న ఉదయం 5 గంటలకు స్ట్రాంగ్‌ రూంలను అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో తెరుస్తామన్నారు. ఇప్పటి వరకు 615 పో స్టల్‌ బ్యాలెట్లు అందాయని, పోస్టల్‌ బ్యాలెట్ల కౌంటింగ్‌ పూర్తయిన తర్వాతచివరి రెండు రౌండ్లు లెక్కించడం జరుగుతుందని, ఈవీఎంల లెక్కింపు పూర్తన తరువాత ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఐదు వీవీ ప్యాట్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి 8న టేబుల్‌పై లెక్కింపు ఉంటుందన్నారు. వీవీ ప్యాట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం సిక్రెట్‌ సీల్‌ వేస్తామన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్‌ కోరారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏజెంట్‌ భాస్కర్‌రావు, ఆయా పార్టీల అభ్యర్థుల ఏజెంట్లు తదితరులు ఉన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...