బాధ్యతగా పని చేయాలి


Thu,May 16, 2019 01:30 AM

హన్వాడ : అధికారులు బాధ్యతగా పని చేసి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ అన్నారు. హన్వాడ మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో బుధవారం సర్పంచులు, ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మిషన్‌ భగీరథ నీటి సరఫరా, హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణాల వివరాలను గ్రామాల వారీగా సేకరించారు. గ్రామాల్లో ఎన్ని వ్యక్తిగత మరుగుదొ డ్లు నిర్మించుకున్నారు? ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌ ఇచ్చారా లేదా? నర్సరీలలో మొక్క ల పెంపకం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే, పలు గ్రామాల్లో వాటర్‌ట్యాంకుల నిర్మాణాలు పూర్తి కాలేదని, న ల్లా కనెక్షన్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదని, నర్సరీల్లో మొక్కలు ఎండిపోతున్నాయని ఆయా గ్రామాల సర్పంచులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్‌ స్పం దిస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూ చించారు. ప్రతి గ్రామంలో వందశాతం వ్య క్తిగత మరుగుదొడ్లు ఉండాలన్నారు. ఇంకా ఎవరైన నిర్మించుకోకుంటే వారికి నోటీసులు జారీ చేసి వారంరోజుల్లో నిర్మించుకునేలా కృషి చేయాలన్నారు.

ప్రతి ఇంటి దగ్గర తప్పనిసరిగా ఇంకుడుగుంత నిర్మించుకునే లా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. జూన్‌ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు హరితహారం మొక్కల పంపిణీకి సిద్ధంగా ఉండాలని సూచించారు. నర్సరీల్లో మొక్కలు ఎండకుండా అధికారులు, ఉపా ధి హామీ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నా రు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో 40వేల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. నర్సరీల్లో అన్ని రకాల మొక్కలను అందుబాటులో ఉంచాలన్నారు. అంగన్‌వాడీ సెంటర్లు, దేవాలయాలు, మసీదులతోపాటు, ప్రతి ప్రభుత్వ కార్యాలయం దగ్గర మిషన్‌ భగీరథ నల్లా కనెక్షన్‌ ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే, ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌ ఇచ్చి తాగునీరు అందించాలన్నారు. అంగన్‌వాడీ సెంటర్లు అద్దె భవనంలో ఉంటే ఆయా ప్రాథమిక పాఠశాలల్లోకి మార్చాలని ఆదేశించారు. మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంకుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పైపులైన్ల లీకేజీలు అరికట్టి నీటి సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ హెచ్చరించారు.

భూ సమస్యలు పెండింగ్‌లో ఉండొద్దు
గ్రామాల్లో ఏమైన భూ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ సంబంధిత అధికారులను ఆదేశించా రు. సర్పంచులు, వీఆర్వోలతో భూ సమస్యలపై సమీక్షించారు. గొండ్యాల గ్రామంలోనే 133 భూ సమస్యలు పెండింగ్‌లో ఎందుకు ఉన్నాయని వీఆర్వోను కలెక్టర్‌ ప్రశ్నించగా, కొన్ని ఆధార్‌ నెంబర్లు లేవని, మరికొన్ని కోర్టు కేసుల వల్ల పెండింగ్‌లో ఉన్నాయని వీఆర్వో తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యలను మినహాయించి మిగతా వాటి ని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ సూచించారు. సర్వే నెంబర్‌ 718లో ఉన్న వారికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. భూ సమస్యల పరిష్కారంపై అధి కారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీ సుకుంటామన్నారు. సమావేశంలో మిషన్‌ భగీరథ ఈఈ వెంకటరమణ, ఎంపీడీవో నటరాజ్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, మిషన్‌ భగీరథ ఏఈ యాదయ్య, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...