నేడు ఏఈవోలకు మట్టి నమూనాలపై శిక్షణ


Thu,May 16, 2019 01:29 AM

జడ్చర్ల: మట్టి నమూనాల (సాయిల్‌ షాంపిల్స్‌)పై ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందిన ఏఈవోలకు శిక్షణ కార్యక్రమాన్ని గురువారం జడ్చర్లలో నిర్వహించనున్నట్లు జడ్చర్ల డివిజన్‌ వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు(ఏడీఏ)శ్రీనివాసరాజు తెలిపారు. ఈ మూడు పాతజిల్లాల నుంచి 200మంది ఏఈఓలు హాజరవుతారని, వారికి మట్టి నమూనాల (భూసారపరీక్షల)పై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 2019-20కి సంబంధించి పాత మూడు జిల్లాల్లోని ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఫైలట్‌ ప్రాజెక్టు కింద తీసుకుని ఆ గ్రామంలోని ప్రతిరైతుకు చెందిన భూములలో మట్టి శాంపిల్‌ను తీసి భూసారపరీక్షలు చేసి వారికి దాని ఫలితాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా ఆయా గ్రామాలకు చెందిన ఏఈవోలకు జడ్చర్ల పట్టణంలోని ప్రేమ్‌రంగా గార్డెన్‌లో గురువారం మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో మట్టి నమూనాలను సేకరించి పరిశీలించిన తర్వాత ఆ గ్రామాల్లో ఎరువుల లభ్యత పటం (సాయిల్‌ ఫర్టిలిటీ మ్యాప్‌ను)ను తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జతోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లా జేడీఏ సుచరితత, ఆయా జిల్లాల జేడీఏలు పాల్గొంటారని ఏడీఏ శ్రీనివాసరాజు తెలిపారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...