68.53 శాతం పోలింగ్‌


Wed,May 15, 2019 02:00 AM

-ప్రశాంతంగా ముగిసిన మూడో విడత ప్రాదేశిక ఎన్నికలు
-పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర పరిశీలకురాలు పౌసమిబసు, కలెక్టర్‌ వెంకట్రావు, ఎస్పీ చేతన
-ఎస్పీ డా.చేతన ఆధ్వర్యంలో ప్రతి కేంద్రం వద్ద భారీ బందోబస్తు
నారాయణపేట, నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో మంగళవారం నాలుగు మండలాలలో నిర్వహించిన మూడో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు విడతలుగా జరిగిన ప్రాదేశిక ఎన్నికలు ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ప్రశాతంగా జరగడంతో మూడో విడత ఎన్నికలను మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని దామరగిద్ద, ధన్వా డ, మరికల్‌, నారాయణపేట మండలాల్లో ఉన్న మొత్తం 55 ఎంపీటీసీ స్థానాలకు గానూ (3 స్థానా లు ఏకగ్రీవం అయ్యాయి.) 52 స్థానాలకు, నాలు గు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన ఈ ఎన్నికల కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్ల మధ్య పోలింగ్‌ను నిర్వహించారు. మొత్తం 1,43,932 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉండగా 68.53 శాతంతో 274 పోలింగ్‌ కేంద్రాలలో 98,640 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎండల తీవ్ర త, ఇతర కారణాలతో మొదటి రెండు దఫాలలో జరిగిన పోలింగ్‌ కన్నా మూడో విడత ప్రాదేశిక ఎన్నికలలో పోలింగ్‌ శాతం కొంత మేర తగ్గింది. రాష్ట్రంలోనే నారాయణపేట జిల్లాలో అత్యల్పంగా ఓటింగ్‌ శాతం నమోదైంది.

పోలింగ్‌ వివరాలు..
నాలుగు మండలాల్లో జరిగిన ప్రాదేశిక ఎన్నికలలో ఏ మండలంలోనూ 70 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదు కాలేదు. దామరగిద్ద మండలంలో మొత్తం 41,995 మంది ఓటర్లు ఉండగా 67.16 శాతంతో 28,202 మంది ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. ధన్వాడ మండలం లో 28,627 ఓటర్లకు గానూ 68.48 శాతంతో 19,603 మంది, మరికల్‌లో 30,075 మంది ఓటర్లకు గానూ 69.77 శాతంతో 20,983 మం ది, నారాయణపేటలో 43,235 మంది ఓటర్లకు గానూ 69.05 శాతంతో 29,852 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన
-రాష్ట్ర పరిశీలకురాలు, కలెక్టర్‌, ఎస్పీ..
పోలింగ్‌ ఆరంభమైన వెంటనే జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు, రాష్ట్ర పరిశీలకురాలు పౌసోమిబసు, జిల్లా ఎస్పీ డా.చేతనలు నాలుగు మండలాలల్లోని పోలింగ్‌ కేంద్రాలను ప్రత్యేకంగా పరిశీలించారు. మరికల్‌ మండలంలోని పెద్దచింతకుంట, మరికల్‌ మండల కేంద్రంలలో పోలింగ్‌ జరుగుతున్న తీరు ను రాష్ట్ర పరిశీలకురాలు పౌసమిబసు ప్రత్యేకంగా పరిశీలించి అధికారులకు తగిన సలహాలు, సూచనలు చేశా రు. కలెక్టర్‌ వెంకట్రావు దామరగిద్ద, ధన్వా డ, మరికల్‌ మండలాలలోని పలు పోలింగ్‌ కేం ద్రాలను పరిశీలించారు. పోలింగ్‌ నమోదవుతున్న వివరాలు, ఓటర్లకు ఇబ్బందులు కలగకుం డా చేసిన ఏర్పాట్లును కలెక్టర్‌ ప్రత్యేకం గా పరిశీలంచారు. జిల్లాలో పోలింగ్‌ సందర్భంగా అవాంచనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ చేతన ఆధ్వర్యంలో బందోబస్తును ఏ ర్పాటు చేశారు.

వాహనాల రద్దీ...
వివిధ ప్రాంతాలలో బతుకుదెరువు కోసం, విద్యాభ్యాసం కోసం వెళ్లిన వారు తమ ఓటు హక్కును వినియోగించు కోవడానికి సొంత గ్రామాలకు తరలిరావడంతో వాహనాల రద్దీ పెరిగింది. సోమవారం నుంచే వివిధ ప్రాంతాలలో ఉన్న జనం తమ సొంతూళ్లకు తరలిరావడంతో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు జనంతో ఆయా గ్రామాలకు చేరుకున్నాయి. ఓటర్లు కొంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వయంగా తరలిరాగ మరికొందరిని అభ్యర్థులు ప్రత్యేక వాహనాలలో తమ ఊళ్లకు రప్పించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం సైతం జనం తిరిగి వెళ్తుండడంతో వా హనాలు కిక్కిరిసిపోయాయి.

ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం అభినందనీయం..
జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించిన ప్రాదేశిక ఎన్నికలు ప్రశాతంగా ముగియడం పట్ల జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు తావివ్వకుండా సహకరించిన జిల్లా ప్రజలకు, రాజకీయ పార్టీల నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విధులను బాధ్యతతో సక్రమంగా నిర్వర్తించి ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించిన అధికారులు, సిబ్బందిని కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు.
ముందస్తు జాగ్రత్తలు ఫలించాయి..
ఎన్నికల నిర్వహణకు ముందస్తుగా తీసుకున్న జాగ్రత్తలు ఫలించాయి. జిల్లా కలెక్టర్‌ వెంకట్రావ్‌ సలహాలు సూచనలు, పోలింగ్‌ సిబ్బందికి పలు దఫాలుగా చేసిన అవగాహానలు, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు జిల్లాల ఎస్పీల సహాకారం తీసుకోవడంతో ఎన్నికలు సజావుగా పూర్తి అయ్యేందుకు ఎంతగానో దోహదపడ్డాయని ఎస్పీ డా.చేతన తెలిపారు. మున్మందు కూడా జిల్లాలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా పోలీస్‌ సిబ్బందిని ఆమె అభినందించారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...