ఆసక్తి కరంగా జిజ్ఞాస, ప్రేరణ తరగతులు


Wed,May 15, 2019 01:59 AM

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : మనిషిని ఆ భగవంతుడు సృష్టిస్తే మానవుని మనుగడతో పాటు జీవరాశుల మనుగడకు మనిషి ఆలోచనలతో జీవం పోయడం జరుగుతుంద పిల్లల మర్రి జిల్లా సైన్స్‌ ఫోరం అధ్యక్షుడు బహీర్‌ ఆహ్మద్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేందరలోని వాగ్దేవి కళాశాలలో విద్యార్థులకు జిజ్ఞాస ప్రేరణ తరుగతుల్లో భాగంగా మౌలిక భావనల అవగాహన శిబిరంను నిర్వహించారు. ఈ శిబిరానికి విద్యార్థులు అత్యధికంగా విచ్చేసి పలు ప్రేరణ తరగతులపై ప్రత్యేక ఆసక్తిగా గమనించారు. న్యూటన్‌, బెర్నోలి సిద్ధ్దాంతాలను పరిగణలోకి తీసుకుని విద్యార్థులు వివిధ ప్రయోగాలు చేశారు. జీవశాస్త్రంలో శ్వాసక్రియ, ప్రసరణకు వ్యవస్థకు సంబంధించిన ప్రయోగాలను విద్యార్థులకు చేసి చూపిస్తూ వారితో ప్రత్యేకంగా చేయిస్తూ కార్యక్రమాలను నిర్వహించారు. సైన్స్‌ మనిషి మనుగడకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రయోగాల ద్వారా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రమణరెడ్డి, శ్రీధర్‌ తదితరులు ఉన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...