పది ఫలితాల్లో గీతం విద్యార్థుల విజయకేతనం


Wed,May 15, 2019 01:59 AM

-అభినందించిన కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌
మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలోని గీతం హైస్కూల్‌ విద్యార్థులు పది పరీక్షా ఫలితాల్లో ప్రత్యేక రికార్డులను తమ సొంతం చేసుకుని విజయకేతనం ఎగురవేశా రు. తమదైన శైలీలో ప్రతిభ కనబర్చి తమకు మరెవరు సాటిలేరని విజయఢంకా మోగించారు. ప్రతిభ కనబర్చిన గీతం హైస్కూల్‌ వి ద్యార్థి బి. సుమనను కలెక్టరేట్‌లో తన ఛాంబర్‌లో కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే డీఈవో నాంపల్లి రాజేష్‌ విద్యార్థులకు అభి నందనలను తెలిపారు. బి.సుమన 10/10 జీపీఏ పాయింట్లను సాధించడం జరిగింది. 9.8 జీపీఏ ఒకరు, 9.7 జీపీఏ ఒకరు, 9.5 జీపీఏ పాయింట్లను ఆరు మం ది విద్యార్థులు, 9.3 జీపీఏ పాయింట్లను ముగ్గురు, 9.2 జీపీఏను ముగ్గురు, 9.0 జీపీఏను నలుగురు విద్యార్థులు తమదైన శైలీలో పరీక్షలు రాసి విజకేతనం ఎగురవేయడం జరిగింది. పాఠశాలలో మొత్తం 18 మంది విద్యార్థులు 9 జీపీఏ కంటే అధికంగా పాయింట్లను సాధించడం జరిగింది. మరింత విద్యార్థులు కూడ మంచి జీ పీఏ పాయింట్ల సాధించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కరస్పాండెంట్‌ సుధారాని, డైరెక్టర్లు శివసూర్య, జ్యోతిరాణి, సాయబన్నగౌడ్‌, ప్రిన్సిపాల్‌ కృష్ణుడు ప్రత్యేకంగా అభినందించారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...