దేవరకద్రలో నిల్చిపోయిన హజారత్‌ నిజామోద్దిన్‌ రైలు


Wed,May 15, 2019 01:59 AM

దేవరకద్ర, నమస్తే తెలంగాణ/ మదనాపురం : దేవరకద్ర రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఉదయం హజరత్‌ నిజామోద్దిన్‌ - సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రైస్‌, కాచిగూడ ప్యాసింజర్‌ రైళ్లు నిల్చిపోయాయి. స్టేషన్‌ మాస్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకద్ర నియోజకవర్గంలోని మదనాపూర్‌ కొన్నూ ర్‌ స్టేషన్‌ల మధ్యలో మంగళవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌కు వెళ్తున్న గూడ్స్‌ రైలు బోగీల మధ్య లింక్‌ ఊడిపోవడంతో గ్ర హించిన డ్రైవర్‌ రైలును అక్కడే నిలిపి ఉన్నత అధికారులకు సమచారం అందించాడు. స్పందించిన అధికారులు వెంటనే ఆ మార్గం గుండా వెళ్తున్న కాచిగూడ- మంగ్లేర్‌ రైలును కౌకుంట్ల రైల్వే స్టేషన్‌ లో నిలిపివేశారు. అదేవిధంగా దేవరకద్రలో హజరత్‌ నిజామోద్దిన్‌- సంపర్క్‌ క్రాంతి రైలు, కాచిగూ డ - గుంటూర్‌ రైలును దేవరకద్ర రైల్వే స్టేషన్‌లో ఉదయం 9.28 నుంచి దాదాపు 1.30 నిమిషాల పాటు ఆపివేయడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు త్రీవ ఇబ్బందులకు గురయ్యారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...