మిషన్‌ భగీరథతో దాహం తీరుతోంది


Wed,May 15, 2019 01:58 AM

-అన్ని గ్రామాలకు మిషన్‌ భగీరథ నీళ్లు
-75 గ్రామాల్లో నల్లాల ఏర్పాటు పూర్తి
-ప్రతి రోజూ ఇంటింటికి తాగునీరు
-తీరిన నీటి కష్టాలు
-హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
హన్వాడ : ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌తో పాటు శుద్ధమైన తాగునీరు అందించాలని సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్‌ భగీరథ పథకం క్షేత్ర స్థాయిలో అమలవుతోంది. మండలంలో పైప్‌లైన్‌ పనులు సకాలంలో పూర్తి చేసి ఎండాకాలంలో ప్రజల దాహం తీర్చుతున్నారు. మిషన్‌ భగీరథ పనులు పూర్తి కాకుంటే తాగునీటికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేంది. ఇంటింటికి నల్లా కనెక్షన్‌ పనులు పూర్తి కావడంతో ప్రతి గ్రామానికి తాగునీరు అందు తోంది. ఇప్పటికే అన్ని గ్రామాల్లో పైపులైన్‌ పూర్తై నీటి సరఫరా జరుగుతోంది. కోయిల్‌కొండ దగ్గర వాటర్‌ను పిల్టర్‌ చేసి అక్కడి నుంచి మండలంలోని గొండ్యాల గ్రామం దగ్గర నిర్మించిన సంపులోకి పంపుతారు. అక్కడి నుంచి ఇతర గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో మండలంలోని 47గ్రామాలకు మిషన్‌ భగీరథ నీళ్లు అందుతున్నాయి. మండలంలోని ఏడు గ్రామాలకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించి మన్యంకొండ దగ్గర పిల్టర్‌ చేసి మండలంలోని 28 గ్రామాలకు శుద్ధజలం అందిస్తు న్నారు. మొత్తం 75గ్రామాలకు మిషన్‌ భగీరథ నీళ్లు అందు తున్నాయి. జిల్లాలోనే మొట్ట మొదటి సారిగా హన్వాడ మండల ప్రజలకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటిని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అందిస్తున్నారు. దీంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 73 ట్యాం కులు మంజూరు కాగా, 67ట్యాంకుల నిర్మా ణం పూర్తి అయింది. 6ట్యాంకుల నిర్మాణం చివరి దశలో ఉంది. అన్ని గ్రామాల్లో నల్లాలు ఏర్పాటు చేశారు. మూడు గ్రామాల్లో మాత్రం పనులు చివరి దశలో ఉన్నాయి.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...