‘మాంటిస్సోరీ’ విద్యార్థుల విజయకేతనం


Wed,May 15, 2019 01:56 AM

పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు
అలంపూర్‌ నమస్తే తెలంగాణ: పదో తరగతి వార్షిక పరీక్షల్లో మాంటిస్సోరీ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. వందశాతం ఫలితాలతో తమకు సాటిలేదని మరోమారు నిరూపించుకున్నారు. 109 మంది విద్యార్థులు 10కి 10 జీపీఏ సాధించారని మరో 90 మంది విద్యార్థులు 9.8 సాధించి ఉమ్మడి జిల్లా, జోన్‌లో అగ్రగామిగా నిలుస్తూ రాష్ట్రస్థాయిలో ప్రముఖస్థానం సాధించారని హెచ్‌ఎం నాగలక్ష్మి అన్నారు. అదేవిధంగా ప్రతి సబ్జెక్టులో 10కి10 జీపీఏ సాధించి విద్యార్థులు తమ ఉనికిని చాటుకున్నారని హెచ్‌ఎం తెలిపారు. ఫలితాలు విడుదలయిన హెచ్‌ఎం మాట్లాడుతూ గతంలో కంటే మాంటిస్సోరీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని అన్నారు. మాంటిస్సోరీ విద్యాసంస్థల వ్యవస్థాపకురాలు కళ్యాణమ్మ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి వారి భవిష్యత్‌కు తొలి అడుగు వేశారని తెలిపారు. ఉత్తమ ఫలితాలు విద్యార్థులకు, వారికి ఉత్తమ విద్యనందించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అదేవిధంగా మాంటిస్సోరీ విద్యాసంస్థలపై నమ్మకం ఉంచి వారి పిల్లలకు విద్యనందించే గురుతర బాధ్యతను అప్పగించిన తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు. పదో తరగతి పరీక్షల్లో కాకుండాఇంటర్‌ జూనియర్‌, సీనియర్‌ ఫలితాల్లో కూడా రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని, 2019 జేఈఈ మెయిన్స్‌లో కూడా 20 మంది విద్యార్థులు అడ్వాన్స్‌ పరీక్షకు ఎంపికయ్యారని తెలిపారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి వారి పురోగతికి బాటలు వేసి ఎళ్ల వేలలా కృషి చేస్తామని హెచ్‌ఎం నాగలక్ష్మి అన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రంలోనే గుర్తింపు సాధించిన అలంపూర్‌ మాంటిస్సోరీ పాఠశాల యాజమాన్యాన్ని స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నారాయణరెడ్డి, సుదర్శన్‌గౌడ్‌, జయరాముడు, వెంకటరామయ్యశెట్టి, మోహన్‌రెడ్డి, ఫయాజ్‌, శంకర్‌, జయక్రిష్ణ, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...