మిషన్ భగీరథ నీళ్లెక్కడ..?


Tue,May 14, 2019 05:16 AM

అడ్డాకుల : మండలంలోని మిషన్ భగీరథ, పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అడ్డాకుల తహసీల్దార్ కార్యాలయంలో సర్పంచులు, కార్యదర్శులు, ఇతర శాఖల అధికారులతో మిషన్ భగీరథ నీటి సరఫరా, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, నర్సరీలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అడ్డాకులలో మిషన్ భగీరథ కింద పైపులైన్లు వేసి ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వలేదని, మరుగుదొడ్లు 85 శాతం పూర్తి కాగా, నర్సరీలలో 80వేల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని సర్పంచు మంజుల, కార్యదర్శి జయవర్ధన్‌రెడ్డి తెలిపారు. ముత్యాలంపల్లిలలో అంగన్‌వాడీ సెంటర్, ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇవ్వలేదని మరుగుదొడ్లు 10 పెండింగ్‌లో ఉన్నాయని, 50వేల మొక్కలు నర్సరీలలో ఉన్నాయని సర్పంచ్ ప్రతాప్‌రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వర్నెలో లక్షా 10వేల మొక్కలు ఉన్నాయని, గ్రామంలో తీవ్ర మంచినీటి కొరత ఉందని, న ల్లా కనెక్షన్లు ఇవ్వలేదని సర్పంచ్ బంగారయ్య తెలిపా రు. పొన్నకల్ నర్సరీలో లక్ష 80వేల మొక్కలు ఉన్నాయని, బీసీ కాలనీలో నీటి సమస్య నెలకొందని సర్పం చ్ కల్పన విజయకుమార్‌రెడ్డి వివరించారు.

కందూరులో నల్లా కనెక్షన్లు పూర్తి కాలేదని సర్పంచ్ శ్రీకాంత్ తెలిపారు. రాచాలలో 4 వాటర్ ట్యాంకులకు గాను 3 ట్యాంకులకు నీటి కనెక్షన్ ఇవ్వలేదని ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నామని సర్పంచ్ తిరుపతయ్య యా దవ్ వివరించారు. శాఖాపూర్‌లో 100 శాతం మరుగుదొడ్లు నిర్మించుకున్నారని, నల్లాలు రోడ్లపై ఎక్కడ ప డితే అక్కడ ఒకేచోట మూడు, నాలుగు ఏర్పాటు చేశారని, వాహనాలు తిరగడంవల్ల పైపులు పగిలిపోతున్నాయని సర్పంచ్ జయన్న గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తిమ్మాయిపల్లిలో నర్సరీలో 55వేల మొక్కలు ఉన్నాయని, వంద శాతం మరుగుదొడ్లు, నీటి సౌకర్యం ఉందని సర్పంచ్ ఆంజనేయులు తెలిపారు. తిమ్మాయిపల్లి తండాలో 100 ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వలేదని, భగీరథ నీరు పుష్కలంగా ఉన్నాయని సర్పంచ్ కిషన్‌నాయక్ తెలిపారు. గుడిబండలో మరుగుదొడ్లు 60 శా తం పూర్తయ్యాయని, మిగిలిన వారు నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావడం లేదని సర్పంచ్ భాస్కర్ నాయుడు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రాంచంద్రాపురంలో 52వేల మొక్కలు సిద్దంగా ఉన్నాయని, వం ద శాంతం నల్లాలు ఉన్నాయని, మరుగుదొడ్లు 80 శా తం పూర్తి అయినట్లు సర్పంచు కృష్ణారెడ్డి తెలిపారు.

బ లీదుపల్లిలో రెండు నీటి ట్యాంకులలో ఒకదానికి మా త్రమే నల్లా కనెక్షన్ ఇచ్చారని, లక్షా 51వేల మొక్కలు ఉన్నాయని, మరుగుదొడ్లు 198కిగాను 140 పూర్తి చేసినట్లు సర్పంచ్ పురుషోత్తం తెలిపారు. చిన్నమున్గా ల్ చేడ్ గ్రామంలో తీవ్ర మంచి నీటి కొరత ఉందని, ఇంతవరకు భగీరథ నీరు అందలేదని, నర్సరీలో 33వే ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని సర్పంచ్ ఆంజనేయులు తెలిపారు. పెద్ద మున్గాల్‌చేడ్ గ్రామంలో భగీరథ నీరు రావడంలేదని, వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకున్నారని, దానిమ్మ, జామ మొక్కలు మొలకెత్తలేదని సర్పంచ్ విజయలక్ష్మి తెలిపారు. కన్మనూరులో మూడు ట్యాంకులకు గాను 2 ట్యాంకులకు న ల్లా కనెక్షన్ ఇవ్వలేదని గేట్‌వాల్ చెడిపోతే మాకు సం బంధం లేదు..మీరే చేసుకోండి అంటూ అధికారులు వ్యవహరిస్తున్నారని సర్పంచ్ సుమతమ్మ కలెక్టర్ దృ ష్టికి తీసుకొచ్చారు. సుంకరామయ్యపల్లిలో పైపులు లేకేజీ అవుతున్నాయని, గ్రామంలో పూర్తిస్థాయిలో నల్లా కనెక్షన్లు ఇవ్వలేదని సర్పంచ్ మల్లిక వివరించారు.

కలెక్టర్ అసంతృప్తి..
మిషన్ భగీరథ అధికారుల పనితీరుపై కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య నెలకొందని, మరుగుదొడ్ల నిర్మాణాలు నిలిచిపోయాయని, ప్రభుత్వ లక్ష్యం ఎందుకు నెరవేరడంలేదని ప్రశ్నించారు. పది రోజులలో తాగునీటి సమస్య తీర్చాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. గ్రామాలలో మరుగుదొడ్ల లక్ష్యం 100 శాతం పూర్తయ్యే వరకు ప్రతి కార్యదర్శి గ్రామాల్లోనే ఉండి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామాల్లోని ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోకుంటే వారికి మూడు మార్లు సెక్షన్ 88/1 కింద నోటీసులు ఇచ్చి వాతావరణాన్ని కాలుష్యం చేసి ప్రజలను రోగాలకు గురి చేస్తున్నందుకు వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు పోలీసు కేసులు పెట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి, ల్యాండ్ సర్వే ఏడీ శ్యాంసుందర్‌రెడ్డి, తహసీల్దార్ రవింద్రనాథ్, ఎంపీడీవో ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...