ఉమ్మడి జిల్లాలో..5 జెడ్పీలు మావే..


Thu,April 25, 2019 03:56 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి/భూత్పూర్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మొత్తం 5 జెడ్పీ చైర్మన్ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వీ.శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం భూత్పూర్ మండల కేంద్రంలో జెడ్పీటీసీ అభ్యర్థిగా స్వర్ణ సుధాకర్‌రెడ్డి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి నామినేషన్ దా ఖలు చేశారు. అంతకుముందు నిర్వహించిన పార్టీ కా ర్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్ దా దాపుగా అన్ని స్థానాలను కైవసం చేసుకుందని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఓటర్లు ఆదరించారని గుర్తు చేశారు. రానున్న ప్రాదేశిక ఎ న్నికల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్ మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, పా ర్టీ సీనియర్ నేత స్వర్ణ సుధాకర్‌రెడ్డిని అధిష్ఠానం నిర్ణయించిందని తెలిపారు. భూత్పూర్ నుంచి టిక్కెట్ ఆ శించిన వారికి పార్టీ న్యాయం చేస్తుందని... జెడ్పీ చైర్మ న్ అభ్యర్థి అయిన స్వర్ణ సుధాకర్ రెడ్డి గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని మంత్రి కోరారు. గతంలో ఎప్పుడు లేనంతంగా టీఆర్‌ఎస్ టిక్కెట్ల కోసం ప్రస్తుతం పోటీ నెలకొని ఉందన్నారు. ఆశావహులు ఎందరో ఉంటారని అన్ని సమీకరణాలు చూసే అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా టికెట్లు రాని వారు నిరాశ చెందవద్దని, వారి సేవలను పార్టీ వినియోగించుకుంటుందని మంత్రి అన్నారు. పార్టీకి విధేయులుగా ఉన్న వారికి తప్పకుండా తగిన న్యాయం జరుగుతుందన్నా రు. పార్టీ నేతలు, కార్యకర్తలంతా సమష్టిగా పనిచేసి పార్టీ తరఫున పోటీ చేస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచేందుకు కృషి చేయాలన్నారు. భూత్పూర్‌కు కూతవేటు దూరంలో 19 టీఎంసీల సామర్థ్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కర్వెన రిజర్వాయర్ పనులు ఆలస్యం అయ్యేందుకు కాంగ్రెస్ నేతలు వేసిన కేసులే కారణమని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 60శాతంపైగా పనులు పూర్తయ్యాయని, మరో రెండేళ్లలో పనులన్నీ పూర్తయి ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఎంపీ ఎన్నికల ప్రచారం లో భాగంగా మహబూబ్‌నగర్‌కు వచ్చి హామీ ఇచ్చిన మేరకు రూ. 18వేల కోట్లు మంజూరు అయ్యాయని, రూ.10వేల కోట్లు బ్యాంకులో జమ కూడా అయ్యాయని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో పాలమూ రు ప్రాజెక్టు సర్వే కోసం నిధు లు కేటాయించేందుకే అప్పటి పా లకులకు మనసు రాలేదన్నారు. పా లమూరులో ఎంపీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం ఈ జిల్లాకు కనీసం ఒక్క హామీ కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఆ పార్టీలకు పాలమూరు జిల్లాపై ఎలాంటి అభిమానం ఉందో చెప్పేందుకు ఇదే ఉదాహరణగా పేర్కొన్నారు.

భూత్పూర్ టీఆర్‌ఎస్‌కు కంచుకోట
- దేవరకద్ర ఎమ్మెల్యే ఆల
భూత్పూర్ టీఆర్‌ఎస్‌కు కంచుకోట అని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. గతంలో భూ త్పూర్ నుంచి తాను జెడ్పీటీసీగా ఘన విజయం సా ధించానని, రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ మండలం నుంచి భారీ మెజార్టీ వచ్చిందని ఆయన వివరించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకున్న నిర్ణయం కారణంగా స్వర్ణ సుధాకర్‌రెడ్డిని భూ త్పూర్ జెడ్పీటీసీగా బరిలో నిలిపినట్లు స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిని తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తున్నందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, జడ్చర్ల ఎమ్మె ల్యే లకా్ష్మరెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అందరికీ అందుబాటులో స్వర్ణమ్మ
- టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి
స్వర్ణ సుధాకర్ రెడ్డికి రాజకీయంగా ఎంతో అనుభవం ఉందని, ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా ఆమెకు పేరుందని మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సీనియర్ నేత అయిన ఆమె పార్టీకి ఎంతో విధేయంగా ఉన్నారని... అందుకే పార్టీ పిలిచి మరీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి గా ఆమెకు అవకాశం ఇచ్చిందని తెలిపారు.

పాలమూరు పూర్తయితే మరింత అభివృద్ధి
- శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే దేవరకద్ర నియోజకవర్గం సైతం సిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేట స్థాయిలో అభివృద్ధి చెందుతుందని శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి అ న్నారు. మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా స్వర్ణ సుధాకర్ రెడ్డిని నిర్ణయించడం సరైన నిర్ణయమని, పార్టీ నేతలు సమష్టిగా పని చేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
- జెడ్పీ చైర్మన్ అభ్యర్థి స్వర్ణ సుధాకర్‌రెడ్డి
జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని టీఆర్‌ఎస్ మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి స్వర్ణ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఒకప్పుడు వలసలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న పాలమూరులో ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల, సాగునీటి వనరులు పెరిగి వలసలు చాలా మేరకు తగ్గాయన్నారు. భవిష్యత్తులో పాలమూరులో వలసలే లేకుండా చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి స్వర్ణ సుధాకర్ రెడ్డి, నేతలు బస్వరాజు గౌడ్, కదిరే శేఖర్ రెడ్డి, సుకన్య నారాయణగౌడ్, రాజశేఖర్ రెడ్డి, చంద్రమౌళి, సత్యనారాయణ తదితరులు నామినేషన్ దాఖలు చేసేందుకు ఎంపీడీవో కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను స్వర్ణ సుధాకర్‌రెడ్డి దాఖలు చేశారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...