ప్రజలు టీఆర్‌ఎస్ వైపే..


Thu,April 25, 2019 03:54 AM

జడ్చర్ల/రాజాపూర్: రాష్ట్ర ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని, అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయఢంకా మోగిస్తారని జ డ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సీ.లకా్ష్మరెడ్డి అన్నారు. జడ్చర్ల లో బుధవారం టీఆర్‌ఎస్ జెడ్పిటీసీ అభ్యర్థి కోడ్గల్ యాదయ్య, రాజాపూర్‌లో టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ అభ్య ర్థి మోహన్‌నాయక్, ఎంపీటీసీ అభ్యర్థి ఎం.మహిపాల్‌రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేయగా, ఎమ్మెల్యే ల కా్ష్మరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత 70ఏళ్ల అభివృద్ధి ని ఐదేళ్లలోనే చే సి చూపిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ లు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు తమ పూర్తి మద్దతు తెలిపి కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమం త్రి చేశారన్నారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో కూ డా ప్రజలు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఉ మ్మ డి జిల్లాలోని అన్ని జెడ్పీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అ భ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నా రు. కార్యక్రమంలో నాయకులు పట్ల ప్రభాకర్‌రె డ్డి, బచ్చిరెడ్డి, నర్సింహులు, ఆనంద్‌గౌడ్, కృష్ణయ్య, నరహరి, యాదగిరి, విజయ్, దేవేందర్, దస్తగిరి, తి రుపతయ్య, శ్రీనివాస్, నర్సింహ పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...