ఎన్నికలకు అవసరమైన సిబ్బంది కేటాయింపు


Thu,April 25, 2019 03:53 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఎక్కడా సిబ్బంది కొరత లేకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ సమావేశ మందరింలో అబ్జర్వర్ పౌసామిబసు, నారాయణపేట కలెక్టర్ ఎస్.వెంకట్‌రావు, ఎస్పీ రెమా రాజేశ్వరి, జెడ్పీసీఈవో వసంతకుమారిలతో కలిసి కలెక్టర్ రొనాల్డ్‌రోస్ రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మాట్లాడుతూ రెండవ విడత ఎన్నికల్లో భాగం అవసరమైన సిబ్బంది కంటే 12శాతం సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. అడ్డాకల్, ముసాపేట, దేవరకద్ర, కోయిల్‌కొండ, సీసీకుంట, మహబూబ్‌నగర్, హన్వా డ మండలాల్లో మొత్తం 91 ఎంపీటీసీ స్థానాలకు, 7 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ మండలాల్లో 5 మంది పోలింగ్ టీంలను 41, 6మంది పోలింగ్ సిబ్బంది టీంలను 396 టీంలను కేటాయించడం జరిగిందన్నారు. వారితో పాటు 12శాతం అదనంగా ఎన్నికల సిబ్బంది ఎన్నికల విధులలో ఉండనున్నట్లు తెలిపారు. నారాయణపేట జిల్లా పరిధిలో మాగనూర్, కృష్ణ, నర్వ, ఊట్కూర్, మక్తల్ మండల కేంద్రంలో 54 ఎంపీటీసీ, 5 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు ఈ దఫాలో జరుగున్నాయని తెలిపారు. 5 మందితో పోలింగ్ టీంలను 21, 6మందితో పోలింగ్ టీంలను 235 మందిని కేటాయించడంతోపాటు అదనంగా 12శాతం సిబ్బంది ఎన్నికల విధులకు కేటాయించినట్లు తెలిపారు. పోలీస్ బందోబస్తును అవసరమైన ప్రాంతాల్లో మరింత ప్రత్యేక దృష్టితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించండి
మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, రెండవ విడత ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ స్టేషన్లకు సిబ్బందిని కేటాయించామని పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించా లని కలెక్టర్ డి.రొనాల్డ్‌రోస్ అన్నారు. బుధవారం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో మండల పరిషత్, జిల్లాపరిషత్ ఎన్నికల నోడల్ అధికారులు, జోనల్ అధికారులతో ఎన్నికల సాధారణ అబ్జర్వర్ శ్రీమతి పౌసామిబసు ఎక్స్‌పెండీచర్ అబ్జర్వర్ ఎన్. శ్రీనివాసులు సమక్షంలో సమావేశంలో కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మాట్లాడారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొదటి విడతగా 79 ఎంపీటీసీ, 7 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగనున్నాయని, 2,39,012 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. మొదటి విడత ఎన్నికలు జరగనున్న 461 పోలింగ్ స్టేషన్లకు అవసరమైన సిబ్బందికి శిక్షణ ఇవ్వ డం పూర్తి అయ్యిందని, 42 పోలింగ్ సెంటర్లలో 129 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించడం జరిగిందన్నారు. 369 ఆయుధాలను జప్తు చేయడం జరిగిందని, ఎన్నికలకు అవసరమైన మేరకు పైబడి బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయన్నారు. బ్యాలెట్ బాక్సు లు, ఎన్నికల సామగ్రి పంపిణీ సేకరణ కేంద్రాలను మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎంసీసీ, ఫ్లయింగ్ స్కాడ్, స్పెషల్ సర్వేలెన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశామని, మండల కేంద్రాలలో తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని, పోలింగ్ రోజున బ్యాలెట్ బాక్సుల సేకరణ పూర్తయిన వెంటనే కౌంటింగ్ కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించడం జరుగుతుందన్నారు. సమావేశానికి ముందు ఎన్నికల జనరల్ అబ్జర్వర్ పౌసుమి బసు సమక్షంలో ఎన్నికల సిబ్బంది కేటాయింపుకై రెండవ విడత ర్యాండమైజేషన్ నిర్వహించారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...