వచ్చే విద్యా సంవత్సరానికి సిద్ధంకండి


Thu,April 25, 2019 03:53 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : ఆరంభం కానున్న విద్యాసంవత్సరానికీ అన్ని విధాలుగా ప్రణాళిక బద్దంగా విద్యాశాఖ అధికారులు సన్నద్ధం కావాలని రాష్ట్ర విద్యశాఖ అధనపు సంచాలకులు శ్రీహరి అన్నారు. బుధవారం వీసీ ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. బడిబయట ఉన్న పిల్లలందరినీ బడిలో చేర్పించేంపదకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పిల్లలు పనిలో ఉండకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి విద్యార్థికి ఉన్నత చదువులు నేర్పించేందుకు సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలతో 2019-20 విద్యాసంవత్సరంలోకి అడుగు పెట్టాలన్నారు. వివిద రాష్ట్ర, జిల్లా స్థాయిలో జరుగనున్న పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్దం చేసి ఆ పరీక్షలను రాసేవిధంగా చూడాలని సచించారు. డిజిటల్ విద్యావిధానం పునఃపరిశీలించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అన్ని సక్రమంగా ఉన్నాయా ? లేవా ? అనే కోణాల్లో పాఠశాలల వారీగా నివేదికలను రూపొందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో కార్యాలయ అధికారి హేమచంద్రుడు తదితరులు ఉన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...