గ్రామాల్లో సర్వే వేగవంతం చేయాలి


Thu,April 25, 2019 03:52 AM

మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తా : మహబూబ్‌నగర్ జిల్లా రైతు సమగ్ర సర్వేను వేగవంతం చేయాలని జేడీఏ సుచరిత అన్నారు. బుధవారం స్థానిక డ్వామా కార్యాలయంలో ఏఓల సమీక్షా సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాలలో రైతుల సమగ్ర సర్వేను వేగవంతం చేయాలని, ఆన్‌లైన్‌లో రైతుల వివరాలను క్షుణ్ణంగా నమోదుచేయాలని వివరించారు. ఎక్కడైనా రైతుల వివరాలు సక్రమంగా లేకుంటే గ్రామ సర్పంచుల సలహా ప్రకారం వివరాలను తీసుకొని ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని సూచించారు. రైతు బీమా సమస్యలు లేకుండా వివరాలను తీసుకొని పూర్తి సమాచారం మేరకు నమోదు చేయాలన్నారు. ఎన్నికల కోడ్‌కు సంబంధం లేకుండా అగ్రికల్చర్ సిబ్బంది నిబంధనలు పాటించి వివరాలను వేగవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారులు హైమావతి, మహబూబ్‌నగర్ వ్యవసాయ అధికారిణి ఆశ్రితాబేగం, వివిధ మండలాల అగ్రికల్చర్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...