విజయోస్తు..!


Wed,April 24, 2019 01:52 AM

-వరుస విజయాలతో టీఆర్‌ఎస్ జోరు
-జనాల్లో వైబ్రేషన్స్ సృష్టిస్తున్న కారు గుర్తు
-గులాబీ పార్టీ నుంచి పోటీ చేసేందుకు క్యూ
-పరిషత్ ఎన్నికల్లో టిక్కెట్ల వేటలో ఆశావహులు
-ఎలాగైనా అధికార పార్టీ తరఫునపోటీ చేయాలని ఆరాటం
మహబూబ్ నగర్ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి:
కారు... ఈ గుర్తు వచ్చిందంటే విజయం సాధించినట్లే లెక్క. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనూ ప్రాదేశిక ఎన్నికల్ల కారు గుర్తుపై పోటీ చేసేందుకు అనేక మంది పోటీ పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని కారు గుర్తు సత్తా చాటింది. ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ కారు జోరు చూపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సారు కారు పదహారు ఢిల్లీలో సర్కారు పేరిట టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన ప్రచారం ముమ్మరంగా ప్రజల్లోకి వెళ్లింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుగా ఈ నినాదిచ్చారు. ఆ తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ స్లోగన్‌తో జనంలోకి వెళ్లారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఎక్కడ చూసినా కారుకు బ్రహ్మరథం పట్టారు. కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రజల నుంచే సర్కారుపై అభిమానం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో ప్రాదేశిక ఎన్నికలు రావడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అయితే కారు గుర్తుతో పోటీ అంటే విజయం నల్లేరుపై నడకే అన్న చందంగా మారడంతో పార్టీ టిక్కెట్లకు ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. ఎలాగైనా గుర్తు పట్టి విజయం దక్కించుకోవాలనే ఉత్సాహమే కనిపిస్తోంది.

అన్నా ఎలాగైనా టిక్కెట్ కావాలె..
అన్నా... నేను మిమ్మల్నే నమ్ముకుని ఉన్నా... ఈసారి నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్ కావాల్సిందే... మీదే బాధ్యత... మీమీదే భరోసా... అంటూ టీఆర్‌ఎస్ నుంచి ప్రాదేశిక టిక్కెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు పార్టీ ఎమ్మెల్యేల వెంట పడుతున్నారు. కారు గుర్తు కోసం క్యూ కడుతున్నారు. ఎలాగైనా టిక్కెట్ దక్కించుకో వాలని ప్రయత్నిస్తున్నారు. కారు గుర్తు వస్తే చాలు అన్నట్లుగా వారు ఎమ్మెల్యేల వెంట పడుతున్నారు. టీ ఆర్‌ఎస్ పార్టీలో ఉన్న నేతలు, కార్యకర్తలు అంతా త మ తమ స్థాయిలో పార్టీ టిక్కెట్లు దక్కించుకుని ప్రాదేశిక ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 71 జెడ్పీటీసీ, 790 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే తొలి విడత 24 జెడ్పీటీసీలు, 294 ఎంపీటీసీలకు పోటీ జరుగుతోంది. తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ టిక్కెట్ల కేటాయింపునకే పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు తల ప్రాణం తోకకు వచ్చింది. అందరూ కావాల్సిన వారే... ఒకరికి టిక్కెట్ ఇచ్చి మరొకరికి రిక్త హ స్తం చూపించాలంటే వారికి కష్టంగా మారింది. దాంతో అందరినీ సమావేశపర్చి.. టిక్కెట్ కేటాయింపులకు కారణాలను వారికి సహేతుకంగా వివరించాల్సి వ స్తోంది. మరికొంత మందికి వేరే అవకాశాలు కల్పిస్తామని పార్టీకి విశ్వాసంతో పనిచేయాలని బుజ్జగింపులు చేయాల్సి వచ్చింది. అందరూ మన వారే కానీ అందరికీ టిక్కెట్లు కేటాయించలేం కదా అని ఓ ఎమ్మెల్యే పరిస్థితిని వివరించారు. గెలుపు గుర్రాలు, స్థానికంగా వారికి ఉన్న మంచి పేరు, పార్టీకి ఇన్నాళ్లుగా ఉన్న విధేయత, పోటీలో నెగ్గుకు వచ్చే లౌక్యం.. ఇలా అన్నీ సమీకరణాలు చూసే టిక్కెట్లు కేటాయిస్తున్నారు.

టిక్కెట్ల కేటాయింపు కత్తిమీద సామే..
టీఆర్‌ఎస్ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీల టిక్కెట్ల కేటాయింపు పార్టీ నేతలకు పెద్ద కసరత్తుగా మారింది. కాం గ్రెస్, బీజేపీలతో పోలిస్తే టీఆర్‌ఎస్‌లో టిక్కెట్ల కేటాయింపు కత్తిమీద సామే అని ఓ ఎమ్మెల్యే తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో అవకాశం రాని వారు ఎంపీటీసీలుగా తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో ఓడిన వారు సైతం తమకు మరో ఛాన్స్ కావాలని వేడుకుంటున్నారు. గ్రా మాల్లో పార్టీకి అండగా ఉండే ముఖ్య నాయకులు అ నేక మంది పోటీకి వస్తుండటంతో ఎవరికి టిక్కెట్ ఇచ్చి నా మరొకరితో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ తరుణంలో అందరిని కూర్చోబెట్టి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు.

అసంతృప్తులను బుజ్జగించి వారికి మరో చోట అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ టిక్కెట్ల కేటాయింపులో ఎమ్మెల్యేలు మా త్రం కొంచెం ఇబ్బంది పడినా.. గెలుపు గుర్రాలను వెతికిపట్టుకున్నట్లు సమాచారం. తొలి విడత కసరత్తు పూర్తయిన నేపథ్యంలో రెండో, మూడో విడత ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై మథనం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి పోటీ చేసేందుకు పెద్ద గా పేరున్న నాయకులెవరూ ముందుకు రావడం లేదు. అక్కడ టిక్కెట్ల కేటాయింపు అత్యంత సులభంగా సా గుతోంది. పోటీ చేస్తామంటే.. టిక్కెట్లు ఇస్తామంటూ పార్టీ నేతలు ముందుకు వస్తున్నట్లుగా సమాచారం. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జిల్లాలో బీజేపీకి పెద్దగా క్యాడర్ లేదు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత పలువురు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరడంతో కాంగ్రెస్‌తో పాటు బీజేపీ సైతం మేము కూడా పోటీలో ఉన్నాం అనే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే రెండు పార్టీల్లోనూ టిక్కెట్ల కోసం మాత్రం పెద్దగా పోటీ నెలకొనలేదని సమాచారం.

129
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...