పరీక్షలకు పకడ్బందీగా సిద్ధంకండి


Wed,April 24, 2019 01:50 AM

-జేఎన్‌టీయూహెచ్‌ఎంసెట్-2019 కోఆర్డినేటర్, ప్రొఫెసర్ ఇందిరా రాణి
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని వి ద్యార్థులు పకడ్బందీ ప్రణాళికలతో సిద్ధం కావాలని జేఎన్‌టీయూహెచ్‌ఎంసెట్-2019 కోఆర్డినేటర్, ప్రొఫెసర్ ఇందిరారాణి అన్నారు. మంగళవారం జిల్లా కేం ద్రానికి సమీపంలో ఉన్న జేపీ ఎన్‌సీఈ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎంసెట్ -2019 అవగాహన సదస్సుకు ఆమె హా జరై మాట్లాడారు. విద్యార్థులు తమ తమ పరీక్షా కేంద్రాలను ముందుగానే చూసుకుంటే ఎంతో ఉపశమనం లభిస్తుందన్నారు. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ముందురోజే పూర్తి స్థాయిలో పరీక్షకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ క్రమంలో హాల్‌టికెట్, బ్లూ, బాల్ పాయింట్ పెన్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం, విద్యార్థి ఫొటోతో కూడిన గజిటెడ్ అధికారి సం తకం కల్గిన ఫారం ఉండాలనే విషయం గమనించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని, ఎలక్ట్రానిక్ వస్తువులను, పరీక్ష హాల్‌లోకి తీసుకు రావద్దని తెలిపారు. కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, టీసీఎస్ ప్రతినిధి బి.సురేష్, జేన్‌టీయూహెచ్ ప్రతినిధి కిరణ్ ఉన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...