సైన్స్‌పై అభిరుచిని కలిగించే..


Wed,April 24, 2019 01:49 AM

-పుస్తకాలు రచించడం అభినందనీయం
-వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
-సైన్స్ డాట్ కం పుస్తకావిష్కరణ
వనపర్తి, నమస్తే తెలంగాణ : శాస్త్ర, సాంకేతిక రం గాలు ప్రాధాన్యత సంతరించుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో సైన్స్ పట్ల అభిరుచిని కలిగించే పుస్తకాన్ని రచించడం అభినందనీయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ప్ర పంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రతాప్ కౌటిల్య రచించిన సైన్స్ డాట్ కం పుస్తకాన్ని మం త్రి తన ని వాస గృహంలో ఆవిష్కరించారు. అనంతరం రచయితను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రె డ్డి మాట్లాడుతూ సృజనాత్మకతకంగా పలు అంశాలను విశ్లేషించి విద్యార్థులకు శా స్త్రీయ దృక్పథం, పరిశోధనలపై ఆసక్తి పెంపొందించేలా ఈ పుస్తకం ఉందన్నారు. సాహిత్యం మానసిక సంతృప్తినిస్తే, సైన్స్ సంపదను సృష్టిస్తుందని, శాస్త్ర సాంకేతిక యుగంలో అందరూ సైన్స్ ఇష్టపడి చదవాలన్నారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత వనపట్ల సుబ్బయ్య, వెంకట్ పవర్, కందికొండ మోహన్, సోమశిల సురేష్‌బాబు, డాక్టర్ వీరయ్య, బత్తుల శీను తదితరులు ఉన్నారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...