నిర్లక్ష్యం సహించం


Wed,April 24, 2019 01:49 AM

-పొరపాట్లు లేకుండా ఎన్నికల ప్రక్రియ జరగాలి
-బ్యాలెట్ బాక్స్‌లను తనిఖీ చేయండి
-సమస్యాత్మక బూత్‌లపై దృష్టి పెట్టండి
-పోలింగ్, కౌంటింగ్ సామగ్రి సేకరించండి
-డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద వసతులు కల్పించాలి
-అధికారుల సమావేశంలో కలెక్టర్ రొనాల్డ్‌రోస్
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : ఎన్నికల్లో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల సిబ్బందిని, ఎన్నికల సామగ్రిని పోలింగ్ స్టేషన్లకు తరలించడానికి అవసరమైన వాహనాలను సమకూర్చాలన్నారు. ఈ వాహనాలు ఆర్‌టీసీ నుంచి అవసరం మేరకు తీసుకోవాలని చెప్పారు. బ్యా లెట్ బాక్సుల తనిఖీ, సర్విసింగ్ పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మరొకసారి పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మరోకసారి సరిచూసుకోవాలన్నారు. పోలింగ్, కౌంటింగ్‌కు అవసరమైన సామగ్రిని ముందస్తుగా సేకరించాలన్నా రు. ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణ నిర్వహించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూంల ఏర్పాట్లు, పోలింగ్ స్టేషన్లలో తాగునీరు, భోజన వసతి, విద్యుత్, ఫ్యాన్లు, లైటింగ్, మరుగుదోడ్లు, ఫర్నించర్, ర్యాంపు లు, వీల్‌చైర్ ఏర్పాట్లతో పాటు తదితర సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలన్నారు.

ఎన్నికలలో విధులు నిర్వహించే సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో తగిన వసతులు కల్పించాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎ క్కడ చిన్నపొరపాటు కూడా జరుగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్ట్రాంగ్ రూం, కౌటింగ్ సెంటర్లను ఒకే చోట ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఎదురైన తక్షణమే సమస్య సద్దుమనిగేలా అధికారులు చర్య లు తీసుకుంటూ ముందకు సాగాలన్నారు. ఎలాంటి ఇబ్బందులున్నా తక్షణమే తమకు సమాచారం అందించాలన్నారు. మొదటి విడత ఎన్నికల విధుల నిర్వహిం చే సిబ్బందినే రెండో విడతలో కూడావిధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు ఎ లాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించేలా మీరందరు సహకరించాలన్నారు. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుం డా ఎన్నికల విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వసంతకుమారి, తదితరులు ఉన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...