పైసలిస్తేనే ఆన్‌లైన్!


Tue,April 23, 2019 12:29 AM

- పార్ట్-బీలో 2,529 కేసులు పెండింగ్!
బల్మూరు: రాష్ట్రంలో పేద ప్రజల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో ప్రజలు, రైతుల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు డబ్బులిస్తేనే పనిచేస్తున్నారు. భూముల వివరాలు అన్‌లైన్‌లో నమోదు చేయాలన్నా.. ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలన్నా.. పైసలిస్తేగాని ఫైల్ ముందుకెళ్ల్లదు. ఆయా గ్రామాల్లోని ఫైరవీకారులు చెప్పినట్లు కార్యాలయంలో అధికారులు పనులు చేస్తారు. మండలంలో చాలా గ్రామాల్లో రైతుల పేరు మీద ఉన్న భూములకు ఫైరవీకారుల మాటలు విని వారు మరణించక ముందే విరాసత్ పేర్ల మీద వ్యవసాయ భూములను పట్టా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు రెండో విడత నేటికీ రైతులకు అందడం లేదు. గతంలో కొండనాగుల, బాణాల, లక్ష్మిపల్లి, బల్మూరు బిల్లకల్ గ్రామాల్లో ప్రభుత్వ భూములు, వారికి సంబంధించిన కుటుంబసభ్యులపై పట్టాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది భూప్రక్షాళనలో భాగంగా రైతుల భూములను అన్‌లైన్‌లో చేయడానికి అవకాశం కల్పించింది. ఇదే అదునుగా భావించిన అధికారులు రైతుల నుంచి వేల రూపాయలు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల తప్పిదం వల్ల కుటుంబసభ్యులు గొడవలు పడి విడిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఒకరి పేరుమీద ఉన్న పట్టాలపై మరో రైతుల పేరుమీద మళ్లీ పట్టాలు చేశారు. నేటికి మండలంలో పార్ట్-బీలో ఇప్పటికీ దాదాపు 2,529 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌లో ఉండటానికి కారణం అధికారులు పైసలు తీసుకొని రైతుల భూములు వేరే వ్యక్తులకు అమ్మినట్లు సృష్టించి పట్టాలు చేయడంతోనే నేటికీ అవి పరిష్కారం చేయలేక పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తల్లిదండ్రులు మరణిస్తేనే వారి కుటుంబసభ్యులకు విరాసత్ ద్వారా భూములు పట్టా చేయాలి. పట్టా చేయాలంటే వారికి ధన పూర్వకంగా ఇస్తేనే రెవెన్యూ అధికారులు పట్టాలు చేస్తున్నారని రైతులు అంటున్నారు. మండలంలోని వీఆర్వో వెంకటయ్యను బల్మూరుకు చెందిన రైతు ఏసీబీ అధికారులకు 2014లో అచ్చంపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పట్టించాడు. నేటికీ కార్యాలయంలో అధికారులకు కొంత ముట్టజెప్తేనే పనులు చేస్తున్నారు. పాత ఆర్‌ఓఆర్, పహాణీలకు కార్యాలయానికి వెళ్తే నేటికీ రైతుల నుంచి సంబంధింత అధికారులు పైసలు తీసుకొని పనులు చేస్తున్నారు.

రైతుబంధు నగదు రాలేదు
వీరంరాజుపల్లి శివారులో సర్వే నంబర్ 38/అ, లో రెండెకరాలు, సర్వే నంబర్ 39లో 2-5ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు మొదటి విడత నగదు వచ్చింది. రెండో విడత రైతుబంధు డబ్బులు నేటికీ రాలేదు. సంబంధింత శాఖల అధికారులకు పలుమార్లు చెప్పినా నేటికీ పరిష్కారం కాలేదు. కార్యాలయాల్లో పైరవీకారులకు ఉన్న విలువ సామన్య రైతులకు లేదు.
- గడ్డమీది సుధాకర్, రైతు, కొండనాగుల

అధికారుల తప్పిదంతో విడిపోయాం
రెవెన్యూ అధికారుల తప్పిదనం వల్ల కుటుంబ సభ్యులం గొడవలు పడి విడిపోయాం. గ్రామానికి చెందిన రైతు కృష్ణయ్య వద్ద జిల్లేలపల్లి శివారులోని సర్వే నంబర్ 13/అ1లో 2-05ఎకరాలను కొనుగోలు చేశాం. 2003లో అచ్చంపేట రిజిస్టేషన్ కార్యాలయంలో వేముల బాలమ్మ చేసుకోవడం జరిగింది. రెవెన్యూ కార్యాలయం నుంచి రైతు పాసుబుక్ తీసుకోవడం జరిగింది. అదే సర్వే నంబర్, అవే హద్దులు గల భూమిపై వేరే వ్యక్తులకు రిజిస్టేషన్, పాసుబుక్ ఇచ్చారు. ప్రస్తుతం గొడవల్లో ఉన్న భూమిపై నూతన పట్టా పాసుబుక్‌లు వచ్చాయి. వాటికి సంబంధించిన పంచాయతీ కోర్టులో కొనసాగుతుంది.
- వెంకట్‌స్వామి, రైతు, అనంతవరం

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...