ఆటకు వేళాయెరా..


Tue,April 23, 2019 12:29 AM

- మే నుంచి వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం
- డీవైఎస్‌వో ఆధ్వర్యంలో 15 వేసవి శిబిరాలు

మహబూబ్‌నగర్ స్పోర్ట్స్: జిల్లా క్రీడాసాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31 వరకు యువత, విద్యార్థులకు వివిధ క్రీడాఅంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభంకానున్నాయి. వర్ధ్దమాన క్రీడాకారులు తమలోని క్రీడా నైపుణ్యాన్ని పదు ను పెట్టుకునేందుకు..తమకు నచ్చిన ఆటలో రాటుదేలేందుకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఎంతో ఉపయోగ పడుతాయి. ఎంతో మంది క్రీడాకారులు శిక్షణా శిబిరాల్లో శిక్షణ పొంది తమ ప్రతిభను చాటి వెలుగులోకి వచ్చి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. జిల్లాలోని గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికి ఈ ఏడాది మే 1 నుంచి 31 వరకు 15 వేసవి శిబిరాలు ఏర్పాటు చేసి శిక్షణ అందజేస్తారు. శాట్స్ ద్యారా 10 శిబిరాలు, డీవైఎస్‌వో ద్వారా 5 శిబిరాలు నిర్వహిస్తున్నారు. వీరికి రూ.2వేల గౌరవవేతనం అందజేయనున్నారు. జిల్లా క్రీడాశాఖ మొత్తం 15 వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుండగా,అందులో శాట్స్ ద్యారా గ్రామీణ ప్రాంతాల్లో 10 శిబిరాలు, జిల్లా క్రీడా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో (అర్బన్) 5 వేసవి శిబిరాలు నిర్వహిస్తారు. అథెటిక్స్,బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, కబడ్డీ,ఖోఖో, వాలీబాల్,ఫుట్‌బాల్, క్రీడా అంశాల్లో ఉచిత శిక్షణ అందజేస్తారు. మల్టీజిమ్, స్విమ్మింగ్‌కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మేలో ఉదయం, సాయంత్రం 2 గంట శిక్షణ అందజేస్తారు..వాలీబాల్(04), ఖోఖో(01),అథ్లెటిక్(03), బాస్కెట్‌బాల్ (02), హ్యాండ్‌బాల్(01) ,కబడ్డీ(01), వ్యాయామం(01), స్విమ్మింగ్(1) శిక్షణ శిబిరాలు ఉన్నాయి. క్రీడా సంఘాల సహ కారంతో యోగా, కబడ్డీ, వాలీబాల్ శిబిరాలు ఆదనంగా నిర్వహిస్తున్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...