గాలివాన బీభత్సం..


Tue,April 23, 2019 12:29 AM

- ఇంటిపై కూలిన చెట్టు
- పిడుగుపాటుకు ఎద్దు మృతి

కోయిలకొండ: మండలంలో సోమవారం సాయత్రం కురిసిన గాలివాన బీభత్సం సృష్టిం చింది.మండలంలోని మోదీపూర్ గ్రామంలో బుగ్గయ్య ఇంటిపై వేప చెట్టు కూలింది. ఆచార్యపూర్ గ్రామంలో రైతు తుక్యానాయక్‌కు చెందిన ఎద్దు పిడుగుపాటుకు మృతి చెందింది. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ రాము కోరారు. గాలివాన కారణంగా మండలంలోని మోదీ పూర్ పరిసరతండాలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. శేరివెంకటాపూర్, సురారం, కొతలాబాద్ తదితర గ్రామాలో గాలులకు మామిడితోటల్లో కాయలు నేలరాలాయి.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...