సమన్వయంతో పని చేయాలి


Mon,April 22, 2019 01:35 AM

కొల్లాపూర్ టౌన్ : కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు జగదీశ్వర్‌రావు, రత్నప్రభాకర్‌రెడ్డి, కోడేరు, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాల నాయకులు ఆయనను ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఆయా సమస్యలు, పనులను ఎన్నికల అనంతరం పరిష్కంచేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అదేవిధంగా మే లో జరగనున్న ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి వనపర్తి, నాగర్‌కర్నూల్ జెడ్పీ చైర్మన్‌తో పాటు అన్ని మండలాల్లో ఎంపీపీ పదవులను టీఆర్‌ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకునే విధంగా పని చేయాలని మంత్రి కోరారు. గ్రామస్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయి క్యాడర్‌ను సమన్వయం చేసుకుంటూ జిల్లా ఇన్‌చార్జి, మాజీ మంత్రి రాములను సంప్రదిస్తూ అన్ని విధాలుగా టీఆర్‌ఎస్ జెండా ఎగురవేసేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా నియోజవర్గంలోని పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే బీరం మంత్రికి ఆందజేశారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...