పాలనకు ఆకర్షితులై..


Mon,April 22, 2019 01:35 AM

కల్వకుర్తి, నమస్తే తెలంగాణ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సాగుతున్న ప్రజారంజక పాలనలో పాలుపంచుకునేందుకే ఇతర పార్టీల్లో కొనసాగుతున్న నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తమ పార్టీలకు రాజీనామా చేసి, టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల మండలం చంద్రాయన్‌పల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు జైపాల్‌రెడ్డితో పాటు మరో 50 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారందరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుభిక్ష పాలన సాగుతుందని, ప్రజలందరూ చాల సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే అ న్నారు. టీఆర్‌ఎస్ దాటికి కాంగ్రెస్ పార్టీ కనుమరుగ య్యే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కొత్త, పాత కార్యకర్తలందరికీ పార్టీలో సమాన అవకాశాలు కల్పిస్తామ ని, అందరూ పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని ఎమ్మె ల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచులు రమేశ్‌రెడ్డి, యాదిరెడ్డి, మాజీ సర్పంచ్ కొండల్‌రెడ్డి, పట్టాభిరాంరెడ్డి, శివరాజ్, చలమంద, సుభాష్, సత్తయ్య, లాలయ్యగౌడ్, నిరంజన్, సుధీర్ పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...