యోగాతో సంపూర్ణ ఆరోగ్యం


Mon,April 22, 2019 01:35 AM

అచ్చంపేట రూరల్ : యోగ, ధ్యానం చేయడం వల్లనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. సత్యసాయి ధ్యాన మండలి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ధ్యాన, యోగ శిక్షణ ను ఎమ్మెల్యే గువ్వల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గువ్వల, ఆయన సతీమణి అమల లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యోగ, ధ్యానం నిత్యం అనుసరిస్తే ఎలాంటి వ్యాధులు రావని స్పష్టం చేశారు. ప్రతి రోజు తెల్లవారుజామున గంటపాటు ధ్యానం చేస్తే వ్యాధి నిరోధకశక్తి, ఆయుష్షు పెరుగుతుందన్నారు. పూజ్యశ్రీ బిక్షమయ్య గురూజీ సేవలను ఆయన కొనియాడారు. బిక్షమయ్య ఆశీస్సులతో రఘు గురూజీ చే నిర్వహిస్తున్న శిక్షణను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తులసీరాం, వైస్ చైర్మన్ విశ్వేశ్వర్‌నాథ్, జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, నాయకులు రాజేందర్, నర్సింహ్మగౌడ్ తదితరులు ఉన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...