ప్రపంచ మేధావి అంబేద్కర్


Sun,April 21, 2019 12:42 AM

మూసాపేట : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే అత్యంత మేధాశక్తి కల్గిన మహోన్నత వ్యక్తి అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రిశ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మూసాపే ట మండలం పోల్కంపల్లి గ్రామంలో అంబేద్కర్ యు వజన సంఘం ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెం కటేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్ధి మన్నె శ్రీనివాస్‌రెడ్డిలతో కలి సి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అవిష్కరించారు. ముందుగా గ్రామస్తులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం మన దేశానికే కాకుండా ప్రపంచంలోనీ చాలా దేశాలకు రాజ్యాంగా న్ని ఆ దేశ స్థితిగతులకు సరిపోయేలా రచించారని, అం దుకే ఆయనకు ప్రపంచ మేధావిగా గుర్తింపు వచ్చిందన్నారు. మన దేశంలోని పేద, నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారిని అభివృద్ధి చెయాలని రా జ్యాంగంలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు. 1956 భారత దేశం ఆర్థికంగా ఎదగాలంటే మహిళలకు పురుషులతో పాటు అన్ని రంగాల్లో సమానత్వం కల్పించాలని రాశారని, కానీ అప్పటి కొంత మంది స్వార్థ రాజకీయ నాయకుల స్వలాభం కోసం అమలు చేయలేదని, అందుకే ఆయన కేంద్ర లా మంత్రి పదవిని తృణప్రయంగా వదిలివేశారని గుర్తు చేశారు. ఆయన రాసిన రాజ్యాంగంతో అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని పొందుపర్చకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేసిన వారందరిపై దేశ ద్రోహం కేసు కింద జైల్లో పెట్టె అవకాశం ఉండేదని మంత్రి అన్నారు. వాటితోపాటు ఆయన ఆర్‌బీఐనీ, కార్మిక చట్టాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చారని చెప్పారు. అంబేద్కర్ ఆశ యం మేరకు పేదలు ఆర్ధికంగా ఎదగాలని సూచించా రు. పోల్కంపల్లి గ్రామానికి డబుల్ బెడ్రూంలు మం జురు చేయడంతోపాటు, చెరువులను నింపి, ఆ చెరువు కట్టపైనే అందరితో పాటు కలిసి భోజనాలు చేస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హామీ ఇచ్చారు.

అంబేద్కర్ దేవుడితో సమానం
- దేవరకద్ర ఎమ్మెల్యే ఆల
అంబేద్కర్ యావత్ తెలంగాణ ప్రజలకు దేవుడితో సమానమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రతి పల్లె శరవేగంగా అభివృద్ధి చెందుతుందంటే అందుకు కారణం అంబేద్కర్ ఆర్టికల్ 3ని పొందుపర్చడమేనని తెలిపారు. విగ్రహాలను ఏర్పాటు చేసి వదిలేయకూడదని, ఆయన విగ్రహం చూసిన ప్ర తి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని, అందు కే పేద, మధ్య తరగతి వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.

సమానత్వం కోసమే రాజ్యాంగం
- టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి
సమాజంలోని అందరూ గౌరవంగా బతకాలని, స మానత్వం కోసమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్ధి మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన రచించిన రాజ్యాంగంతో దేశంతోపాటు ప్రతి కుటుంబానికి మేలు జరిగేవిధంగా ఉందని, వాటిని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ ల బ్ది పొందుతూ సమాజంలో గౌరవంగా బతకాలని సూ చించారు. అంతకు ముందు జెడ్పీటీసీ రామన్‌గౌడ్, గ్రామ సర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్ధి సుజా త, నర్సింహులు మాట్లాడారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ఇంద్రయ్యసాగర్, నాయకులు భీంరెడ్డి, ఎండీ సత్తార్, రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు.

మేం ఏం చేస్తున్నామనేది మీ పిల్లలను అడగండి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వా త ముఖ్యమంత్రి కేసీఆర్, మేము ఏం చేస్తున్నామనేది మీ పిల్లలను అ డగాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అ న్నారు. టీఆర్‌ఎస్ చేస్తున్న అభివృద్ధి పనులు గ్రామాల్లో మీ కళ్ల ముందే కనిపిస్తున్నాయని చెప్పారు. దీనిపై మీ పిల్లలనే అడంగండి అంటూ.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సమావేశంలో ఏవరైనా సరే.. ఎక్కడైనా సరే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఉన్నారా అని అడగడంతో గ్రామానికి చెందిన కీర్తన అనే అ మ్మాయి లేచి నేను 5వ తరగతి చదువుతున్నానని చె ప్పింది. ఆ పాపను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అందరి స మక్ష్యంలోనే స్టేజీపైకి పిలిచి మీ పాఠశాలలో భో జనం మంచిగా ఉంటుందా.. లేకుండా మీ ఇంట్లోనే బాగుంటుందాని అని విద్యార్థినిని మంత్రి అడిగారు. అందుకు ఆ పాప మాట్లాడుతూ స్కూల్‌నే మంచిగ ఉంటుందని చెప్పింది. అదేవిధంగా మీకు మీ సా రోల్లో చదువు మంచిగా చెప్తున్నారా లేదా అంటే మంచిగానే చెప్తున్నారని తెలిపింది. అభివృద్ధితోనే ఆ ర్థికంగా ఎదగలేమని, అందుకే విద్యా పరంగా కూడా మీ పిల్లలను మంచి మేధావులుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, అందుకే ఇప్పటికైన ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే నడవాలని, ఎన్నికలు ఏవొచ్చినా టీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...