జిల్లా పోలీస్ కార్యాలయంగా పేట పీఎస్


Sun,April 21, 2019 12:40 AM

- ప్రస్తుత ఎస్పీ కార్యాలయంలో సీఐ, పోలీస్‌స్టేషన్ కార్యాలయాలు
- ఆర్టీసీ కాలనీలో డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు
- ప్రస్తుత సీఐ కార్యాలయంలో ఎస్పీ కార్యాలయం

నారాయణపేట, నమస్తే తెలంగాణ : నారాయణపేట జిల్లా ఏర్పాటు అనం తరం ఒక్కసారిగా పోలీస్‌శాఖకు సంబంధించిన కార్యాలయాల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లా ఏర్పాటు అనంతరం నూతన ప్రభుత్వ కార్యాలయ ఏర్పాటు కోసం అనువైన భవనాలు పట్టణ పరిధిలో లేకపోవడంతో కొన్ని శాఖలకు సంబంధించిన రెండుమూడు కార్యాలయాలను కలిపి తాత్కా లికంగా ఒకే దగ్గర ఏర్పాటు చేసి ఇప్పటివరకు ఆ శాఖ పరిధిలో కార్య కలాపాలను కొనసాగించారు. కానీ పోలీస్‌శాఖకు సంబంధించిన కార్యాలయాలు అన్ని కూడా ఒకే దగ్గర ఏర్పాటు చేయడానికి వీలు ఉండదు. వీలు ఉన్నప్పటికీ కూడా ఈ శాఖ పరిధిలో కార్యకలాపాలు కొనసాగాలంటే కచ్చితంగా జిల్లా పోలీస్ కార్యాలయం, ఎస్పీ, డీఎస్పీ కార్యాలయాలకు ప్రత్యేకంగా భవన సముదా యాలు ఉండా ల్సిందే. అందుకు గానూ సివిల్‌లైన్‌లో గల ప్రస్తుత పోలీస్‌స్టేషన్ ఆవరణలో డిస్ట్రిక్ పోలీస్ కార్యాలయం ఏర్పాటు కానుం ది. అలాగే నారాయ ణపేట సర్కిల్ కార్యా లయంలో ఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. అంబేద్కర్ చౌరస్తాలో ప్రస్తుతం ఉన్న ఎస్పీ కార్యాలయంలో నారాయణపేట సర్కిల్ కా ర్యాలయంతో పాటు పోలీస్‌స్టేషన్‌ను మార్పు చేశారు. డీఎస్పీ కార్యాలయాన్ని ఆర్టీసీ కాలనీలో గల నూతనంగా ఏర్పా టు చేయనున్నారు. కాగా నారాయణపేట జిల్లా ఏర్పాటు తో ఇక్కడికి జిల్లాకు కేటాయించిన పోలీస్‌ఫోర్స్ రావడంతో వీరికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండేలా ప్రస్తుత పోలీస్‌స్టేషన్‌లో డిస్ట్రిక్ పోలీస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత ఎస్పీ కార్యాలయం పైభాగంలో సీఐ కార్యాల యం కింది భాగంలో పోలీస్‌స్టేషన్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. పోలీస్‌శాఖకు సంబంధించిన ఆయా కార్యాలయాల మార్పు కారణంగా శనివారం పోలీస్‌స్టేషన్, సర్కిల్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయం లో ఉన్న ఫర్నీచర్, ఇతర ఫైళ్లను సిబ్బంది ఆయా స్థానాలకు తరలించారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...