జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక


Sun,April 21, 2019 12:39 AM

మహబూబ్‌నగర్ స్పోర్ట్స్ : మహారాష్ట్రలోని షిర్డీలో నేటి నుంచి 26 వరకు జరగనున్న జాతీయస్థాయి మినీ వాలీబాల్ టోర్నీలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు జిల్లా క్రీ డాకారులు ఎంపికయ్యారు. రాష్ట్రబాలికల జట్టుకు మంజుల, కవిత, జ్యోతి, బాలుర జట్టుకు విజయ్ చౌహన్, నాగచరణ్ ఎంపికగా, బాలుర జట్టుకు పర్వేజ్‌పాష కోచ్‌గా వ్యవహరించనున్నారు. జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికావటం పట్ల జిల్లా వాలీబాల్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శాంతికుమార్, మహ్మద్‌హనీఫ్ అభినందించారు. జాతీయస్థాయి టోర్నీలో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలువాలని ఆకాంక్షించారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...