ప్రజాసేవే ప్రధాన ధ్యేయం


Sun,April 21, 2019 12:39 AM

- జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు పట్ల ప్రభాకర్‌రెడ్డి
రాజాపూర్: ప్రజసేవే ప్రధాన ధ్యేయంగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు పట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు.శనివారం మండల కేంద్రంలోని అకాష్‌గ్రాండ్ హోటల్‌లో టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్‌కట్ చేసి వేడుకులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పాలనలో ఉమ్మడి బాలానగర్ , రాజాపూర్ మండలాల్లో జడ్చర్ల శాసన సభ్యుడు ,మాజీ మంత్రి డాక్టర్ సీ.లకా్ష్మరెడ్డి సహకారంతో ఎన్నో అభివృద్ధి పనుల చేశామని, ఉమ్మడి మండలాలు అన్ని రంగాల్లో అభివృద్ధ్ది సాధిసున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన నాయకుడు లక్ష్మన్‌నాయక్, టీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షుడు యాదగిరి, మల్లేష్‌గౌడ్, నారాయణరెడ్డి, జగన్‌నాయక్, విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీనునాయక్, రణతుంగరెడ్డి, జనార్ధన్‌గౌడ్ పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...