పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు


Sat,April 20, 2019 12:33 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు ఈనెల 28న నిర్వహించనున్న పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని పాలిటెక్నిక్ కళాశాల కోఆర్డినేటర్ నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 19 సెంటర్లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మొత్తం 9988 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు.ఈ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు ఉంటుందని, నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష హాల్‌లోకి అనుమతించమని పేర్కొన్నారు. ప్రతి అభ్యర్థి తమ హాల్‌టికెట్‌పై లేటెస్ట్ ఫొటోను అటాచ్ చేసుకొని పరీక్షకు హాజరు కావాలని సూచించారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...