ఘనంగా హనుమాన్ శోభాయాత్ర


Sat,April 20, 2019 12:33 AM

మక్తల్, నమస్తే తెలంగాణ : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం మక్తల్ పట్టణంలో వీర హనుమాన్ శోభాయాత్ర కనుల పండువగా జరిగింది. శోభాయాత్రను రైచూర్ నీలగిరిశాలి మఠ పీఠాధిపతులు సుగురయ్యస్వామి ప్రారంభించారు. వీహెచ్‌పీ, భజరంగదళ్, ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో అలంకరించిన వాహనంపై ఆంజనేయస్వామి ప్రతిమతో పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. ముందుగా ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కా ర్యక్రమంలో నాయకులు భీంరెడ్డి, విజయకృష్ణ, కావలి వెంకటేశ్, భాస్కర్‌రెడ్డి, ర మేశ్, సత్యనారాయణగౌడ్, కుర్మయ్య, తిరుపతి, శ్రీనివాసులు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...