ఇంటర్ ఫలితాల్లో స్కాలర్స్ విద్యార్థుల ప్రభంజనం


Sat,April 20, 2019 12:33 AM

వనపర్తి విద్యావిభాగం : గురువారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో స్కాలర్స్ కళాశాల విద్యార్థులు జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రభంజనం సృష్టించారని యాజమాన్య సభ్యులు జగదీశ్వర్, సత్యనారాయణరెడ్డి, వరప్రసాదరావు, నాగేశ్వర్‌రెడ్డిలు తెలిపారు. శుక్రవారం స్కాలర్స్ కళాశాల ప్రాంగణంలో జరిగిన అభినందన సభలో ద్వితీయ సంవత్సరం బైపీసీలో జె.వెన్నెల 980, షేక్ ఇర్ఫాన్ 980 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో అగ్రభాగాన నిలిచారన్నారు. జి.మధు 979, నితిన్‌కుమార్ 978 మార్కులు సాధించారన్నారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో లలిత 980 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి మార్కులతో కళాశాల టాపర్‌గా నిలిచింది. వెంకటసాయి లోహిత్ 979, రాము 977, సాయి సుప్రజ 976 మార్కులు సాధించారన్నారు. ప్రథమ సంవత్సర ఫలితాల్లో బైపీసీలో అస్మా 431 జిల్లా ర్యాంకర్‌గా, సుప్రియ 428, ప్రతిభ 428, శ్రుతి 426 మార్కులు సాధించారన్నారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో సానియా బేగం 458, సుప్రియ 457, ఆర్టి 455, పావని 453 మార్కులు సాధించారన్నారు. అదేవిధంగా ప్రథమ సంవత్సరం ఎంఈసీలో జయశ్రీ 452, సీఈసీలో కళావతి 428 మార్కులతో కళాశాల టాపర్‌గా నిలిచారన్నారు. ద్వితీయ సంవత్సరం సీఈసీలో కె.లావణ్య 928, ఎంఈసీలో సృజన 821 మార్కులు సాధించి కళాశాల టాపర్లుగా నిలిచారన్నారు. ఈ ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన బోధన సిబ్బందిని, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వారు అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీధర్, మధుసూదన్‌గుప్తా తదితరులు ఉన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...