వైభవంగా ఎంకన్న పౌర్ణమి కల్యాణం


Sat,April 20, 2019 12:33 AM

మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తా : మహబూబ్‌నగర్ మండలంలోని మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వర స్వామి పౌర్ణమి కల్యాణ వేడుకలను శుక్రవారం దేవాలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణ వేడుకలకు భక్తులు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి ప్రతి సంవత్సరం పౌర్ణమి కల్యాణానికి హాజరవుతారని దేవాలయ ధర్మకర్త అళహరి మధుసూధన్‌కుమార్ తెలిపారు. ఈ కల్యాణంలో పాల్గొంటే పెళ్లి కాని అమ్మాయిలకు, అబ్బాయిలకు త్వరగా పెళ్లిలు నిశ్చయమవుతాయని ఆనాటి నుంచి నేటి వరకు భక్తులు నమ్మకంతో వేంకటేశ్వర స్వామి కల్యాణంలో పాలు పంచుకుంటారు. భక్తుల కోరికలు తీర్చే వేంకటేశ్వర స్వామి నిరంతరం భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి కోరికలను తీరుస్తున్నాడు. కనుకనే పౌర్ణమి కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటాచారి, ప్రధాన అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...