ఆహారం తిని 15 గొర్రెలు మృతి


Sat,April 20, 2019 12:32 AM

పెంట్లవెల్లి : మండల పరిధిలోని గోప్లాపురం గ్రామంలో విషపు ఆహారం తిని 15 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుని తెలిపిన వివరాలు ప్రకారం.. గోప్లాపురం గ్రామానికి చెందిన గోవు బాలరాజు ఉపాధి నిమిత్తం 20 గొర్రె పిలల్లను పోషిస్తున్నారు. రోజు వారి మాదిరి గురువారం గొర్రె పిల్లలను మేత మేపడానికి గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. గడ్డి మేసిన అనంతరం సాయంకాలం ఇంటికి తీసుకు వచ్చాడు. శుక్రవారం ఉదయం తిరిగి మేపడానికి గొర్రె పిల్లల దగ్గరికి వెళ్లి చూస్తే అవి మృత్యువాతపడ్డాయి. దీంతో లబోదిబోమంటూ సుమారు లక్ష వరకు తనకు ఆర్థిక నష్టం వాటిళ్లిందని రోధించాడు. చుట్టుపక్కల వారు గమనించి బాధితుని ఓదార్చారు. అనంతరం గ్రామస్తులు పశు వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి గొర్రె పిల్లల శవాలకు పంచనామా నిర్వహించి తొలి ఏట మొలిచే గడ్డిని అతిగా తినడం వల్లన్న ఆ గడ్డి విషంగా మారి జీర్ణం కాక గొర్రెలు మృతి చెందాయని మండల పశు వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి మండలాల జెడ్పీటీసీ లోకారెడ్డి మాట్లాడుతూ బాధితుడిని ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...