బాలికలదే పైచేయి


Fri,April 19, 2019 03:33 AM

- ఉదయం నుంచి ఫలితాల కోసం నిరీక్షించిన విద్యార్థులు
- ప్రతి సంవత్సరం ఒకటి, రెండు శాతం పెరుగుతున్న ఉత్తీర్ణత
- ద్వితీయ సంవత్సరంలో తగ్గిన ఉత్తీర్ణత
- ఇంటర్ మొదటిలో 55శాతం, ద్వితీయ 60శాతం ఉత్తీర్ణత
- రాష్ట్ర స్థాయిలో మొదటి సంవత్సరంలో 11వ, రెండో సంవత్సరంలో 12వ స్థానం

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : ఇంటర్ ఫలితాలలో జిల్లాలో బాలికలదే పైచేయి సాధించారు. మ హబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల పరిధిలో ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటికే విడుదల కావాల్సిన ఫలితాలు ఆలస్యంగా గురువారం విడుదల అవుతాయని ఇంటర్ బోర్డు అధికారులు తెలియజేయడం జరిగింది. గురువారం ఉదయం నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూ శారు. సాయంత్రం 5:30గంటల తరువాత ఫలితాలు వెలువడడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఒక్క సారిగా నెట్ సెంటర్లలోను, వెబ్‌సైట్‌లలో ఫలితాలు చూసుకున్నారు. ఉత్తీర్ణత శాతం సాధించిన వారిలో సంతోషం, ఉత్తీర్ణత సాధించన వారిలో కొంత నిస్సయత కనిపిచింది. గతేడాదితో పోల్చితే ఇప్పుడు ఇంట ర్ మొదటి సంవత్సరం ఫలితాలు ఒక్కశాతం పెరిగితే, రెండో సంవత్సరం ఫలితాల్లో గతేడాది కంటే ఒక్కశాతం తగ్గింది. రాష్ట్ర స్థాయి ఇంటర్ ఫలితాలల్లో మొదటి సం వత్సరం విద్యార్థులు 11వ స్థానంలో ఉండగా, రెండో సంవత్సరం ఫలితాలు 12 స్థానంలో మహబూబ్‌నగర్ జిల్లా నిలిచింది. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని ప్రతి భ కళాశాల తమ దైన శైలీలో ఉమ్మడి జిల్లా పరిధిలోని ఉత్తీర్ణత శాతం తమ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలోని జలజం జూనియర్ కళాశాల ఉమ్మడి జిల్లా పరిధిలోని మొదటి ర్యాంకులను తమ ఖాతాలో వేసుకుంది. మొదటి సంవత్సరంలోని సీఈసీ, ఎంఈసీ విభాగంలో ఉమ్మడి జిల్లాలో ప్రథమ స్థానం లో నిలిచారు. ద్వితీయ సంవత్సరంలో సీఈసీ విభాగంలో 968 మార్కులతో ఫైజా నిషాద, ఎంఈసీ విభాగంలో నిరంజన్ అనే విద్యార్థి 947 మార్కులతో ఉమ్మ డి పాలమూరు జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రథమ ర్యాంకులు సాధించడం జరిగింది. ఈ కళాశాలలతోపాటు వాగ్దేవి, రిషి, ఆ దర్శ కళాశాలల విద్యార్థులు వివిధ ర్యాంకులు తమ సొంతం చేసుకుని ఇంటర్ ఫలితాలల్లో తమ సత్తా చా టారు. జిల్లాకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ను తీసుకువచ్చేందుకుగాను విద్యార్థులు పలు ర్యాం కులు సాగించి తమ సొంతం చేసుకోవడం జరిగింది.

ఇంటర్‌లో ఉత్తీర్ణత ఇలా..
ఇంటర్ ఫలితాలు మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు సాధించిన ఫలితాలు ఇలా ఉన్నాయి. మొదటి సంవత్సరంలో జనరల్ విభాగంలో బాలురు 5320 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2432 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 6323 మంది పరీక్షలు రాయగా, 4020 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరంలోని బాలురు 5305 మంది పరీక్షలు రాయగా, 2842 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 6083 మంది పరీక్ష రా యగా 4073 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి పురుషుల కంటే బాలికలే ఇంటర్ ఫలితాల్లో పై చేయి సాధించారు.

ఐదేళ్లలో ఇంటర్ ప్రథమ,
ద్వితీయ సంవత్సరం ఫలితాలు
గడిచిన ఐదేళ్లలో ఇంటర్ ఫలితాలను పరిశీలిస్తే ప్రతి సంవత్సరం మొదటి, ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఒక్కటి, రెండు శాతం పెరుగుతూ రావడం జరిగింది. 2014 సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో కేవలం 42శాతం ఉత్తీర్ణత ఉండగా, రెండో సంవత్సరం విద్యార్థులు మాత్రం 52 శాతంతో ముందంజలో ఉన్నా రు. ఈ క్రమంలోనే ప్రతి సంత్సరం అంచెలంచెలుగా ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతూ రావడం జరిగింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఫలితాలు గురువారం ఫలితాలను పరిశీలిస్తే మొదటి సంతవ్సరం వి ద్యార్థులు 55శాతం ఉండగా, రెండో సంవత్సర విద్యార్థులు గతేడాదితో పోల్చితే ఒక్కశాతం తగ్గి 60 శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది.

జనరల్ విభాగంలో విద్యార్థులు ఉత్తీర్ణత శాతం
మొదటి సంవత్సరం 11643 6452 55 శాతం
రెండవ సంవత్సరం 11388 6915 60 శాతం
ఒకేషనల్ విభాగంలో...
మొదటి సంవత్సరం 1582 931 59 శాతం
రెండవ సంవత్సరం 1475 1002 68 శాతం

సంవత్సరం ఫస్టియర్ సెకండియర్
2014 42 శాతం 52 శాతం
2015 45 శాతం 52 శాతం
2016 44 శాతం 55 శాతం
2017 49 శాతం 60 శాతం
2018 54 శాతం 61 శాతం
2019 55 శాతం 60 శాతం

మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 65 శాతం ఉత్తీర్ణత
మక్తల్, నమస్తే తెలంగాణ : తెలంగాణ ఇంటర్మిడియట్ బోర్డు గురువారం సాయంత్రం విడుదల చేసిన ఇంటర్మిడియట్ ప్రథమ, ద్వితీయ ఫలితాలల్లో మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 65 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా బాలికలదే అధిక శాతం ఉత్తీర్ణత ఉందని జూనియర్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సుదర్శన్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 392 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 65 శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగిందని పేర్కొన్నారు. ద్వితీయ సంవత్సరం హెచ్‌ఈసీలో తస్లిమా ముంజు 925, బైపిసి ద్వితీయ సంవత్సరంలో మల్లమ్మ 917, సీఈసీ ద్వితీయ సంవత్సరంలో రేవతి 802 మార్కులు సాధించడం జరిగిందని పేర్కొన్నారు. మొదటి సంవత్సరంలో సిఈసిలో శంకర్ 451, కె. మహేశ్ 446, నగేశ్ 439 మార్కులు సాధించడం జరిగిందన్నారు. హెచ్‌ఈసీ మొదటి సంవత్సరంలో తపస్సుం బేగం 410 మార్కులు సాధించిందని తెలిపారు. మొత్తం మీదుగా కళాశాలలో బాలికలదే ఉత్తీర్ణతలో పై చేయి ఉందని పేర్కొన్నారు.

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు
మాగనూరు : ఇంటర్ ఫలితాల్లో మండల కేంద్రంలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు సత్తా చాటారు. గురువారం సాయంత్రం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో 103 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 41 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 112 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 74 మంది ఉత్తీర్ణులైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుదర్శన్ తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో బైపీసీలో వాకిటి రాజు 913, జ్యోతి 902, సీఈసీలో తస్లీమాబేగం 863, నాగమ్మ 862 మార్కులు సాధించి కాలేజీ టాపర్లుగా నిలిచారన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

ఇంటర్ ఫలితాలలో పేటజూనియర్ కళాశాల ప్రతిభ
నారాయణపేట రూరల్: గురువారం వెలువడిన ఇంటర్ ఫలితాలలో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉర్దూ, తెలుగు మీడియం విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. ఎంపీసీలో ఉమ్మి అబీబాకు మొత్తం 1000 మార్కులకు గాను 940 మార్కులు సాధించగా, బైపీసీలో ముస్కన్ 1000 మార్కులకు గాను 900 మార్కులు సాధించారు. సీఈసీలో గాయత్రి 1000 మార్కులకు గాను 875 మార్కులు సాధించి ద్వితీయ సంవత్సరం కాలేజీ టాపర్‌గా నిలిచింది. మొదటి సంత్సరం ఎంపీసీ విభాగంలో భార్గవి 470 మార్కులకు గాను 375 మార్కులు సాధించచి కాలేజీ టాపర్‌గా నిలిచింది.

అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఆదర్శ కళాశాల
మహబూబ్‌నగర్ నమస్తే తెలంగాణ: జిల్లా కేంద్రంలోని ఆదర్శ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. బైపీసీ విభాగంలో రెండో సంవత్సరంలో ఎస్.అరుణ 970, కేఎస్‌ఆర్ వైష్ణవి 969, టి. హరితరెడ్డి 967, ఎంపీసీ విభాగంలో వి.సాయిశిరిష 870, సాయి కృష్ణవంశీ -864, కె. రాజ్‌కుమార్ 845 అ త్యుత్తమ మార్కులు సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీపీలో జె.అనూష 432, ఎండీ హిదతుల్లా 401 , సీఈసీలో రాధిక 436 మార్కులు సాధించి ప్రతిభ కనబర్చారు. కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మార్కులు సాధించిడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ ఏ.ఆంజనేయులు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

20న స్పాట్ కేంద్రాల్లో నిరసన
మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తా : జిల్లాలో ఎస్సెస్సీ స్పాట్ వాల్యూవేషన్ నిర్వహించే కేంద్రాల వద్ద ఉపాధ్యాయులు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు నిరసన కార్యక్రమం నిర్వహించాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ వాల్యూవేషన్ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని 52 సంఘాల మద్దతుతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...