దళారీ వ్యవస్థ నిర్మూలించాలి


Fri,April 19, 2019 03:31 AM

పాలమూరు యూనివర్సిటీ : వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో దళారుల వ్యవస్థను నిర్మూలించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి అన్నారు. గురువారం పాలమూరు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కామర్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెటింగ్‌పై అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. ఆన్‌లైన్ వాణిజ్య రంగంపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీలకు ఇనాం వేదిక ఉపయోగ పడుతుందన్నారు. అనాధిగా వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నూతన ఆవిష్కరణలతో విప్లవ ఫలితాలను తీ సుకొస్తుందన్నారు. రైతులు పండించిన ఉత్పత్తులను నేరుగా మార్కెట్‌లో అ మ్ముకునే విధంగా ఇప్పటికే ఎన్నో రకా ల మార్పులు, రైతుబజారు వంటి కేంద్రాలను ఏర్పాటు చేసి నూతన ఒరవడికి చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు తమ ఉత్పత్తులు అమ్మడానికి మార్కెట్ యార్డులలో పడిగాపులు కాచే రోజులు మారుతున్నాయని, ఆన్‌లైన్ వ్యాపారాల ద్వారా కనీస మద్దతు ధర రైతులకు అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతు బజార్లలో మధ్య దళారుల జో క్యం లేకుండా చేయడానికి, ప్రత్యక్షంగా కూరగాయ లు, పండ్లు, వినియోగదారులే విక్రయించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం రైతులకు రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుందని, వాటి వల్ల రైతు నష్టాల బారిన పడకుండా సొంతంగా వ్యవసాయం చేసుకునేందుకు పెట్టుబడులను అంది స్తుందని పేర్కొన్నారు. పాలమూరు విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్ రాజారత్నం మాట్లాడుతూ గ్రామాలలో రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర లభించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. రైతు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని, వారు పండించే పంటలను నేరుగా అమ్ముకునే అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో పాలమూరు విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ గిరిజా మంగతాయారు, తెలంగాణ ఇండియన్ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అప్పారావు, కామ ర్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ వెంకటరమణ, వైస్ చైర్మన్ తెలంగాణ ఉన్నత విద్యా మండలి పీయూ డీన్, కామర్స్ విభాగం వెంకటేశ్వర్లు, పీయూ ఎగ్జామినేషన్ బ్రాంచి ఇన్‌చార్జి పవన్‌కుమార్, అధ్యాపకులు మనోజ, ప్రిన్సిపాల్ నూర్జహన్, ప్రభాకర్‌రెడ్డి, నర్సింహులు, రాజ్‌కుమార్, అర్జున్‌కుమార్, వైఎస్‌ఎన్ మూ ర్తి, బాల్‌రాజ్, కుమారస్వామి, మాళవి, వివిధ విభాగాల ఇన్‌చార్జులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...