28న పోలీస్ రాత పరీక్ష


Thu,April 18, 2019 12:22 AM

- ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు..
- పాలమూరు జిల్లాలో 19 పరీక్షా కేంద్రాలు
- హాజరుకానున్న 9988 మంది అభ్యర్థులు
- హాల్ టికెట్లపై లేటెస్ట్ ఫొటో అటాచ్ చేసుకోండి
- పాలమూరు ఎస్పీ రెమా రాజేశ్వరి
- చీఫ్ సూపరింటెండెంట్లతో సమావేశం

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : ఈనెల 28వ తేదీన పోలీస్ రిక్రూట్‌మెంట్ ఫైనల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాలమూరు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో పాలిటెక్నిక్ కళాశాల కోఆర్డినేటర్ నాగరాజు సమక్షంలో పరీక్షల పరీక్షల సిబ్బందితో ఎస్పీ సమావేశమై మాట్లాడారు. ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు, నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు నియమ నిబంధనల మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష హాల్‌లోకి అనుమతించవద్దని ఎస్పీ సూచించారు. ప్రతి అభ్యర్థి తమ హాల్ టికెట్‌పై లేటెస్ట్ ఫొటోను అటాచ్ చేసుకొని పరీక్షకు హాజరుకావాలని సూచించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తులు పరీక్ష హాల్‌లోకి అనుమతించబడవన్నారు. నకిలీ అభ్యర్థులను పరీక్ష హాల్‌లోకి ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకుండా డిజిటల్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఇందులో భాగంగా అభ్యర్థుల థంబ్‌ను తీసుకుంటామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పాలిటెక్నిక్ జిల్లా కో ఆర్డినేటర్ నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 9,988 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఏఏస్పీ వెంకటేశ్వర్లు, పాలిటెక్నిక్ కళాశాల కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణ, అధికారులు సాయిమనోహర్, తదితరులు పాల్గొన్నారు.

నేడు పీయూలో జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ సదస్సు
పాలమూరు యూనివర్సిటీ: పాలమూరు విశ్వ విద్యాలయం పరిధిలో రెండో జాతీయ అగ్రికల్చర్ మార్కెటింగ్ సదస్సు శుక్రవారం యూనివర్సిటీ లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతుందని వీసీ రాజారత్నం తెలిపారు. గురువారం పీయూ వీసీ యూనివర్సిటీ పరిపాలనా భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సదస్సుకు రాష్ట్ర ఎక్సైజ్, యువజన శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్ లింబాద్రి హాజరవుతున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు వీసీ వివరించారు. విలేకరుల సమావేశంలో పీయూ ప్రొఫెసర్ హెచ్. వెంకటేశ్వర్లు, రిజిస్ట్రార్ గిరిజా మంగతాయారు, పరీక్షా విభాగం ఇన్‌చార్జి పిండి పవన్‌కుమార్, బీఎన్‌ఎన్ మూర్తి, అనురాధ, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

127
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...